ఆ స్టార్ హీరో వల్ల కంపెనీ మూసేయాల్సొచ్చింది!
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నానని, భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే వారిలో ఒకరిగా ఉన్నానని తెలిపారు.
By: Sivaji Kontham | 30 Jan 2026 9:42 AM ISTకొందరు డబ్బు మ్యాటర్ లో సంపదలను దాచుకోవడంలో చాలా కచ్ఛితంగా ఉంటారు. అయితే అలాంటి కచ్ఛితత్వం కొన్నిసార్లు ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా నష్టాలు ఎక్కువగా ఉండే గ్లామర్ పరిశ్రమలో పారితోషికాల విషయంలో కచ్ఛితత్వం కావాలనుకుంటే అది చాలా ఇబ్బందికర పరిణామాలను సృష్టిస్తుంది. అలాంటి ఒక ఇబ్బందికర పరిణామం ఒక ప్రముఖ స్టార్ హీరో ఎదుర్కొన్నారు.
అయితే ఈ ఎపిసోడ్ లో సినిమా నిర్మాత సదరు స్టార్ హీరోపై తీవ్రంగా ఎటాక్ చేసారు. ఆయన అదృష్ట సంఖ్య 9 అయితే ఆ నంబర్ వచ్చేందుకు తన పారితోషికాన్ని రూ. 15 కోట్ల నుంచి ఏకంగా 36 కోట్లకు పెంచాడని ఘాటైన విమర్శలు చేసాడు. అతడితో తీయాలనుకున్న సినిమా బడ్జెట్ రూ. 35 కోట్లు గా నిర్ణయించాం. సినిమా మొత్తం మున్నార్ లో చిత్రీకరించాలని ప్లాన్ చేసాం. కానీ అనూహ్యంగా కాన్వాస్ ఫారిన్ కి మారింది. కెనడా, కేప్ టౌన్ లాంటి చోట్ల చిత్రీకరించాల్సి రావడంతో బడ్జెట్ అనూహ్యంగా 85 కోట్లకు చేరిపోయింది. అదుపు తప్పిన బడ్జెట్ ఒకవైపు.. డిజాస్టర్ ఫలితం మరోవైపు ఊపిరాడనివ్వలేదు. ఆర్థికంగా తీవ్రమైన నష్టాలొచ్చాయి. నష్టాల కారణంగా నిర్మాణ సంస్థను మూసివేయాల్సి వచ్చింది. అయితే నష్టాల్లో కొంత షేర్ చేసుకోమని అభ్యర్థించినా సదరు స్టార్ హీరో ససేమిరా అన్నారని సదరు నిర్మాత వాపోయారు.
అంతేకాదు.. ఆ హీరో గారు డబ్బు విషయంలో ఖరాకండిగా ఉంటారు. అతడు మొదట బిజినెస్‌మేన్.. ఆ తర్వాతే నటుడు. ఎదుటివారిని కష్ట నష్టాల్లో ఆదుకోవాలనే ఆలోచన ఉండదు! అని కూడా ఆ హీరోతో పని చేసిన నిర్మాత తీవ్రంగా విమర్శించాడు. ఆర్థికంగా నష్టాల కారణంగా తన కంపెనీ దివాళా తీసిందని, నిర్మాణ సంస్థను మూసేయాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేసారు.
అయితే ఈ నిర్మాత విమర్శలకు సదరు స్టార్ హీరో అస్సలు స్పందించలేదు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నానని, భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే వారిలో ఒకరిగా ఉన్నానని తెలిపారు. అంతేకాదు... ఆర్థిక వ్యవహారాల్లో ప్రాక్టికల్ గా ఉంటే తప్పేమీ కాదని కూడా సదరు స్టార్ హీరో ఆ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
అంతటి జాగ్రత్త పరుడు కాబట్టే ఈ స్టార్ హీరో ఏకంగా 2700కోట్ల నికర సంపదలతో భారతదేశంలోని టాప్ 20 సెలబ్రిటీ ఎర్నర్ జాబితాలో ఉన్నాడు. ఫోర్బ్స్ జాబితాలోను చేరాడు. ఒక్కో సినిమాకి 100 నుంచి 145 కోట్ల వరకూ అందుకుంటున్నాడని కూడా కథనాలొచ్చాయి. అయితే తన సంపాదనను అస్సలు వృథా చేయకుండా రియల్ ఎస్టేట్ సహా సొంత స్టార్టప్ కంపెనీల సృష్టి కోసం సద్వినియోగం చేస్తున్నాడు. డబ్బు డబ్బును పెడుతుంది. అపార సంపదలను సృష్టిస్తుంది. అలా నేడు పరిశ్రమలో సుస్థిరమైన స్టార్ గా ఎదిగాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్టార్ హీరో పేరు అక్షయ్ కుమార్. నష్టపోయిన నిర్మాత పేరు శైలేంద్ర సింగ్. 8 x 10 తస్వీర్ సినిమాని తెరకెక్కించినప్పుడు తాను తవ్రంగా నష్టపోయానని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ ఫార్ములాను అనుసరించేవాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. గ్లామర్ రంగంలో ఏరు దాటాక తెప్ప తగలేసే బాపతే ఎక్కువ. చాలా మంది జాగ్రత్తగానే ఉన్నారు. తెలుగు సినిమా రంగంలోను డబ్బు మ్యాటర్స్ లో నిర్మొహమాటంగా ఉండే హీరోలకు కొదవేమీ లేదనే కథనాలు గతంలో వచ్చాయి. సరైన ఆర్థిక ప్రణాళిక ఒక్కటే వ్యక్తుల మనుగడను నిర్ధేశించగలదు.
