Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

ఇదే ప్రొడక్షన్ హౌస్ నుంచి సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మరో భారీ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది.

By:  M Prashanth   |   3 Nov 2026 9:56 AM IST
అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?
X

ఒక సినిమాకు రిలీజ్ కు ముందే ఎంటర్టైన్మెంట్ డోస్ శాంపిల్ చూపించడంలో అనిల్ రావిపూడి రూటే వేరు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా టైమ్ లో వెంకటేష్ తో కలిసి ఆయన చేసిన సోషల్ మీడియా రచ్చ అంతా ఇంతా కాదు. స్క్రీన్ పై కంటెంట్ పక్కన పెడితే, బయట చేసిన హడావుడితోనే సగం బజ్ తెచ్చేశారు. కానీ చిత్రంగా అదే సినిమాను బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ వైబ్ ఎక్కడా కనిపించట్లేదు.

'మౌజా హీ మౌజా' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తో పాటు విద్యాబాలన్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ అనీస్ బజ్మీ డైరెక్షన్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గానే రాశీ ఖన్నా తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 4న విడుదల చేయాలని మొదట అనుకున్నప్పటికీ, ఆ ప్లాన్ మారినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ కానీ, కనీసం టీజర్ కానీ బయటకు రాలేదు.

ఇదే ప్రొడక్షన్ హౌస్ నుంచి సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మరో భారీ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా ఈద్ 2027కి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కానీ చేతిదాకా వచ్చేసిన అక్షయ్ కుమార్ సినిమాను మాత్రం ప్రమోషన్లలో ఎందుకు లైట్ తీసుకుంటున్నారనేది ట్రేడ్ వర్గాలకు అర్థం కావడం లేదు. రేపు థియేటర్లకు ఆడియన్స్ రావాలంటే ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేయాలి.

తెలుగులో అనిల్ రావిపూడి మార్కెటింగ్ స్ట్రాటజీ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ గా మారింది. గోదారి గట్టు, మీను పాటలు రీల్స్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. వెంకీ పాత ఐకానిక్ పాత్రలను రీక్రియేట్ చేస్తూ చేసిన సరదా ఇంటర్వ్యూలు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. అనిల్ స్వయంగా ప్రతి ప్రమోషన్ లో కనిపిస్తూ నవ్వులు పంచడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఆ స్థాయి స్పీడ్ ఇప్పుడు బాలీవుడ్ టీమ్ లో కనపడటం లేదు.

పైగా తెలుగు ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. హిందీ నేటివిటీ కోసం కథలో భార్య, మాజీ ప్రేయసి కాన్సెప్ట్ మాత్రమే ఉంచి మిగతా డ్రామా అంతా మార్చామని అనీస్ బజ్మీ చెబుతున్నారు. వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్ లాంటి కల్ట్ కామెడీలు తీసిన దర్శకుడే అయినప్పటికీ, హిందీలో ఏ కొత్తదనం చూపించ బోతున్నారో ముందే జనాల్లోకి తీసుకెళ్లాలి.

ఆ మార్పులు ఏంటో కనీసం టీజర్ ద్వారానైనా చూపించకపోతే ఆడియన్స్ కు థియేటర్ దాకా వచ్చే ఆసక్తి కలగదు. తెలుగులో సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది కానీ బాలీవుడ్ లో అలాంటి స్పెషల్ డేస్ ఏమీ లేవు. అక్షయ్ గత చిత్రాల ఫలితాలు చూశాక, కేవలం కాంబినేషన్ క్రేజ్ తోనే థియేటర్లు నిండిపోతాయని అనుకుంటే పొరపాటే. అనిల్ రావిపూడి తరహాలోనే అక్షయ్, విద్యాబాలన్ లతో కలిసి అనీస్ బజ్మీ ఏదైనా క్రేజీ కామెడీ ప్రమోషనల్ వీడియోతో రంగంలోకి దిగితే తప్ప సినిమాపై బజ్ రాదు. సమయం తక్కువగా ఉన్న ఈ టైమ్ లో మేకర్స్ ఎప్పుడు మేల్కొంటారో చూడాలి.