Begin typing your search above and press return to search.

సెల‌బ్రిటీల బిగ్ బిజినెస్ & గ్లామరస్ నైట్స్!

మీడియా కెమెరాల విష‌యంలో అతిథుల రాకపోకలు, డ్రెస్సింగ్ స్టైల్స్ , గోప్యతా విషయాలలో తారలు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు.

By:  Srikanth Kontham   |   27 Oct 2026 4:00 AM IST
సెల‌బ్రిటీల బిగ్ బిజినెస్ & గ్లామరస్ నైట్స్!
X

దీపావళి పండుగొస్తే బాలీవుడ్ లో తారల సందడికి అంతు ఉండదు. ముంబై నగరంలో జరిగే సెలబ్రిటీల దీపావళి పార్టీలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అయితే ఈ ఏడాది బాలీవుడ్‌లో జరగబోయే దీపావళి వేడుకలకు సంబంధించిన ఓ ప్రత్యేకమైన పార్టీల క్యాలెండర్ సోషల్ మీడియాలో ..సినీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. అక్షయ్ కుమార్ మొదలుకొని స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వరకు ప్రముఖులు ఈ ఏడాది ఇళ్ల లో ప్రత్యేక వేదికలపై ఘనమైన దీపావళి పార్టీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెలబ్రిటీలు ఏ రోజున పార్టీలు ఇస్తున్నారు అనే షెడ్యూల్ బ‌య‌ట‌కొచ్చింది.

అయితే ఈ పండుగ సంబరాల వెనుక ఓ ఆసక్తికర కోణం కూడా బయట పడింది. ఎప్పటిలాగే ఉత్సాహంగా పాల్గొనే ప్రముఖులు ఈసారి మాత్రం కొంత ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు ఇన్‌సైడర్లు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగా నిబంధనలు లేని ఈవెంట్ లా కాకుండా పబ్లిక్ అటెన్షన్ .. భద్రతా పరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

మీడియా కెమెరాల విష‌యంలో అతిథుల రాకపోకలు, డ్రెస్సింగ్ స్టైల్స్ , గోప్యతా విషయాలలో తారలు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. విపరీతమైన ట్రోల్స్ , సోషల్ మీడియా రియాక్షన్‌లకు తావులేకుండా ఉండేందుకే ఈసారి వేడుకల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. మరోవైపు ఈ ఏడాది పార్టీలలో పాల్గొనే అగ్ర హీరోహీరోయిన్లు .. ప్రముఖ దర్శకుల లిస్ట్ కూడా చాలా పెద్దదే ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేసిన మనీష్ మల్హోత్రా పార్టీకి ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు. ఈసారి కూడా అత్యంత విలాసవంతమైన రీతిలో వేడుకలు జరగనుండటంతో అభిమానులలో అంచనాలు తారా స్థాయికి చేరాయి.

మొత్తానికి బాలీవుడ్‌లో దీపావళి అంటే గ్లామర్, ట్రెండింగ్ ఫ్యాషన్ పార్టీల హోరు. కొన్ని ముందస్తు జాగ్రత్తలు .. ప్రైవసీ రూల్స్ మధ్య జ‌రుగుతున్నా? ఈ ఏడాది సెలబ్రిటీల దీపావళి క్యాలెండర్ మాత్రం అభిమానులకు కను విందు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ వ్యాపార వర్గాలకు, సినీ బంధాలకు అడ్డాగా ఈ వేడుక మార‌నుంది. అలాగే పండుగ సీజన్‌లో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రకటనలు, నటీనటుల కలయికలు.. బడా నిర్మాణ సంస్థల చర్చలకు దీపావళి వేడుకలు అద్భుతమైన వేదికగా నిలవబోతున్నాయి.