Begin typing your search above and press return to search.

అక్ష‌య్ ఫ్లాపుల ప‌రంప‌ర కొన‌సాగేట్టే ఉందిగా!

ఎవ‌రైనా స‌రే మంచి సినిమాలు చేసి స‌క్సెస్ అందుకుని కెరీర్లో మంచి స్టార్‌డ‌మ్ అందుకోవాల‌నే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 Sept 2025 7:00 PM IST
అక్ష‌య్ ఫ్లాపుల ప‌రంప‌ర కొన‌సాగేట్టే ఉందిగా!
X

ఎవ‌రైనా స‌రే మంచి సినిమాలు చేసి స‌క్సెస్ అందుకుని కెరీర్లో మంచి స్టార్‌డ‌మ్ అందుకోవాల‌నే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తారు. అయితే కొన్నిసార్లు ఆ సినిమాలు స‌క్సెస్ అయితే మ‌రికొన్ని సార్లు వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ ఉంటాయి. విన్న‌ప్పుడు బాగానే అనిపించిన క‌థ‌, తీరా సినిమాగా మారి రిలీజ‌య్యాక వేరేలా అనిపించ‌డం, కొన్నిసార్లు త‌ప్పు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వల్ల సినిమాలు ఫ్లాపవుతూ ఉంటాయి.

స‌క్సెస్ ను పెద్ద‌గా ప‌ట్టించుకున్నా ప‌ట్టించుకోక‌పోయినా, ఫ్లాప్ వ‌స్తే మాత్రం వారిపై ఎక్క‌డ లేని విమ‌ర్శ‌లు, ట్రోల్స్ చేస్తూ వారిని మరింత నిరాశ ప‌రుస్తూ ఉంటారు. ఒక్క ఫ్లాప్ ఎఫెక్ట్ ఆ త‌ర్వాత ఎంతో కాలం ఉంటుంది. ఆ స్టార్లు చేసే నెక్ట్స్ సినిమాల‌పై కూడా ఫ్లాపుల ఫ‌లితం బాగా ఉంటుంది. ప్ర‌స్తుతం అలాంటి ఫేస్ లోనే ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్.

అక్ష‌య్ కు క‌లిసి రాని టైమ్

కొన్ని సినిమాలుగా అక్ష‌య్ కుమార్ ఏం చేసినా ఆయ‌న‌కు టైమ్ అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు వ‌రుస ప‌రాజ‌యాల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కు ఫ్లాపుల మీద ఫ్లాపులు ఎదుర‌వుతున్నాయి. గ‌త కొంత కాలంగా అక్ష‌య్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించిన స‌క్సెస్ అందుకోలేక‌పోతున్నాయి. మ‌ధ్య‌లో ఓఎంజీ2 పేరుతో సూప‌ర్ హిట్ అందుకున్నారు కానీ త‌ర్వాత మ‌ళ్లీ మామూలే. హిట్ కోసం అక్ష‌య్ త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ ఆ స‌క్సెస్ మాత్రం ఆయ‌న‌కు ద‌క్క‌డం లేదు.

దీంతో అక్ష‌య్ కుమార్ ఫ్యాన్స్ ఆశ‌ల‌న్నీ ఎల్ఎల్‌బీ3 పైనే పెట్టుకున్నారు. అక్ష‌య్ ఫ్లాపుల స్ట్రీక్ కు ఈ సినిమా ఫుల్‌స్టాప్ పెడుతుంద‌నుకుంటే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న ఫ‌లితాల్ని రాబ‌ట్ట‌లేక‌పోయేలా అనిపిస్తుంది. క‌థ ప‌రంగా మంచి స‌బ్జెక్టే అయినా దాన్ని డెవ‌ల‌ప్ చేసి ప్రెజెంట్ చేసే విధానంలో డైరెక్ట‌ర్ త‌డ‌బ‌డ్డారు. అలా అని ఈ సినిమా బాలేదా అని కొన్ని ఎపిసోడ్స్ బావున్నాయి. కేవ‌లం ఆ కొన్ని సీన్స్ తో ఎల్ఎల్‌బీ3 ను హిట్ అని చెప్ప‌లేం. ఎల్ఎల్‌బీ ఫ్రాంచైజ్ లో వ‌చ్చిన మొద‌టి రెండు సినిమాల‌ను దృష్టిలో పెట్టుకోకుండా ఈ సినిమాను చూస్తే యావ‌రేజ్ అనిపిస్తుంది కానీ వాటిలా ఊహించుకుని సినిమా చూస్తే మాత్రం ఆడియ‌న్స్ కు నిరాశ త‌ప్ప‌దు. ఏదేమైనా అక్ష‌య్ కుమార్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇస్తార‌నుకున్న ఫ్యాన్స్ ఆశ ఈసారి కూడా తీరేలా క‌నిపించ‌డం లేదు.