Begin typing your search above and press return to search.

వీడియో: ఖిలాడీ బాబుతో రెచ్చిపోయిన రాశీఖ‌న్నా.. నెక్ట్స్ ఏంటి?

ఈ వినోదాత్మక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రాశీ ఖన్నా ప్రత్యేకమైన క్యాప్షన్‌తో శుభాకాంక్షలు తెలిపారు.

By:  Sivaji Kontham   |   9 Sept 2026 8:12 PM IST
వీడియో: ఖిలాడీ బాబుతో రెచ్చిపోయిన రాశీఖ‌న్నా.. నెక్ట్స్ ఏంటి?
X

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో సెల‌బ్రేష‌న్స్ కి దారి తీసాయి. ఈ సందర్భంలో కథానాయికలు రాశీ ఖన్నా, విద్యా బాలన్ లతో కలిసి అక్షయ్ చేసిన ఒక ఫన్నీ డ్యాన్స్ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఒక ప్రైవేట్ జెట్ విమానం ముందు ఈ ముగ్గురు స్టార్స్ వేసిన హై-ఎనర్జీ డ్యాన్స్ స్టెప్పులు.. వారి సరదాలు, అల్లరి నెటిజన్లను విప‌రీతంగా ఆకట్టుకోవడమే కాకుండా బాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

ఈ వినోదాత్మక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రాశీ ఖన్నా ప్రత్యేకమైన క్యాప్షన్‌తో శుభాకాంక్షలు తెలిపారు. ``తన చుట్టూ ఉండే వారితో కష్టపడి పనిచేయిస్తూనే.. అంతకంటే ఎక్కువగా నవ్వించే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు! ఇంకాస్త ఎక్కువ డ్యాన్స్- మరికొంత అల్లరి మీ సొంతం కావాలి.. హ్యాపీ బర్త్‌డే అచ్చే సర్!`` అంటూ అక్షయ్‌ను ఆప్యాయంగా `అచ్చే సర్` అని సంబోధిస్తూ రాసుకొచ్చిన ఎమోష‌న‌ల్ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

ఈ వీడియో బయటకు రాగానే అభిమానులు- నెటిజన్ల నుంచి కామెంట్ల సునామీ చ‌ర్చ‌గా మారింది. గతంలో `హే బేబీ`, `భూల్ భూలయ్యా` వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అక్షయ్ కుమార్, విద్యా బాలన్‌లను మళ్లీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడటం పాత రోజులను గుర్తుచేస్తోందని ఫ్యాన్స్ మురిసిపోయారు. వయస్సు పెరుగుతున్నా అక్షయ్‌లో తగ్గని ఎనర్జీ.. దానికి తోడు రాశీ ఖన్నా - విద్యా బాలన్‌ల `పూకీ డ్యాన్స్` వైబ్స్ వీడియోకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయని కొనియాడారు.

ప్రైవేట్ జెట్ ముందు ఈ ముగ్గురు ప్రదర్శించిన క్రేజీ కెమిస్ట్రీ చూస్తుంటే ఇది కేవలం పుట్టినరోజు వేడుక మాత్రమే కాదని.. త‌దుప‌రి ఒక భారీ ప్రాజెక్ట్ షూటింగ్ లొకేషన్ విజువల్స్ అయి ఉంటాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. అక్షయ్ కుమార్, రాశీ ఖన్నా, విద్యా బాలన్ కలయికలో ఒక ఎంట‌ర్‌టైనింగ్ కాంబినేషన్ సెట్ కాబోతోందని.. ఈ సెట్స్‌లోని సరదా వాతావరణమే త‌దుప‌రి సినిమా విజయాన్ని సూచిస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి `ఖిలాడీ` బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో నిలవడమే కాకుండా... వీరి కాంబినేషన్‌లో త‌దుప‌రి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలను పెంచేసింది. ఈ కాంబో నిజంగానే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయబోతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా స్పష్టం కానుంది.