Begin typing your search above and press return to search.

ర‌ణ్‌బీర్ మూవీపై ఖిలాడీ క్రేజీ కామెంట్స్‌!

అంతే కాకుండా ఈ మూవీలోని ఇంటిమేట్ సీన్‌ల‌పై ఫెమినిస్ట్‌లు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, వాటికి సందీప్‌రెడ్డి వంగ ఘాటుగా రిప్లై ఇవ్వ‌డం వివాదంగా మారి `యానిమ‌ల్‌` మరింత ట్రెండ్ అయ్యేలా చేసిన విష‌యం తెలిసిందే.

By:  Ravindar Gorantla   |   21 April 2026 6:00 PM IST
ర‌ణ్‌బీర్ మూవీపై ఖిలాడీ క్రేజీ కామెంట్స్‌!
X

ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టించిన రివేంజ్ ఎమోష‌న‌ల్ డ్రామా `యానిమ‌ల్‌`. తండ్రి కోసం ఓ కొడుకు ప‌డే త‌ప‌న‌, తండ్రిపై కొడుకుకున్న ప్రేమ‌, వీరిద్ద‌రి నేప‌థ్యంలో వ‌చ్చే భావోద్వేగ స‌న్నివేశాలు, రొమాంటిక్ సీన్స్‌, యాక్ష‌న్ అంశాల నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంల‌చ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.900 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. సందీప్ రెడ్డి వంగ త‌న‌దైన స్టైల్ మేకింగ్‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డ‌మే కాకుండా ర‌ణ్‌బీర్ కంప్లీట్‌గా స‌రెండ‌ర్ అయి న‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అంతే కాకుండా ఈ మూవీలోని ఇంటిమేట్ సీన్‌ల‌పై ఫెమినిస్ట్‌లు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, వాటికి సందీప్‌రెడ్డి వంగ ఘాటుగా రిప్లై ఇవ్వ‌డం వివాదంగా మారి `యానిమ‌ల్‌` మరింత ట్రెండ్ అయ్యేలా చేసిన విష‌యం తెలిసిందే. 2023లో విడుద‌లైన ఈ సినిమా ర‌ణ్‌బీక‌ర్ క‌పూర్ కెరీర్‌లోనే మ‌ర్చిపోలేని మూవీగా నిలిచింది. అప్ప‌టి వ‌ర‌కు కెరీర్ ప‌రంగా లోలో ఉన్న ర‌ణ్‌బీర్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించి మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. త్వ‌ర‌లో దీనికి సీక్వెల్‌గా `యానిమ‌ల్ పార్క్` రానున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్ష‌య్ కుమార్ `యానిమ‌ల్‌` మూవీపై, బాబీ డియోల్‌పై చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఓ పోడ్ కాస్ట్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అక్ష‌య్ కుమార్ `యానిమ‌ల్‌` మూవీతో పాటు బాబీ డియోల్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో పాటు బాబి డియోల్ చేసిన క్యారెక్ట‌ర్లని మ‌ర్చిపోలేను. మ‌రీ ముఖ్యంగా బాబీ డియోల్ యాంగ్రీ యంగ్ మెన్‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌కు ప‌దిరెట్లు మించి న‌టించాడు.

అమితాబ్ బ‌చ్చ‌న్ టైమ్‌లో యాంగ‌ర్ అనేది చాలా లిమిట్‌గా నిర్దిష్ట ప‌రిథి వ‌ర‌కే చూపించే వారు. కానీ `యానిమ‌ల్‌`లో మాత్రం అది ఆ ప‌రిదిని కూడా దాటిపోయింది. ఔట్ ఆఫ్ ది లిమిట్‌గా చూపించారు. సందీప్‌రెడ్డి వంగ చాలా డిఫ‌రెంట్ ప‌ద్ద‌తిలో దీన్ని ప్ర‌జెంట్ చేశారు.ఇది మాకు ఓ కొత్త సినిమాగా అనిపించింది. హీరోని చూసే విధానం కూడా చాలా కొత్త‌గా ఉంది` అంటూ చెప్పుకొచ్చారు అక్ష‌య్ కుమార్‌. ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ‌, బాబి డియోల్‌ల‌ని పొగుడుతూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

`యానిమ‌ల్‌`లో ర‌ణ్‌బీర్ క్యారెక్ట‌ర్ ఎంత ఎక్స్‌ట్రీమ్‌కు వెళుతుందో బాబి డియోల్ క్యారెక్ట‌ర్ కూడా అంతే ఎక్స్‌ట్రీమ్‌కు వెళుతుంది. త‌న‌కు న‌చ్చ‌ని దాన్నిర‌ణ్‌బీర్ క్యారెక్ట‌ర్‌ ఎంత క్రూరంగా నాశ‌నం చేస్తాడో..బాబి డియోల్ క్యారెక్ట‌ర్ కూడా అంతే క్రూరంగా నాశ‌నం చేయ‌డంతో ఇద్ద‌రి క్యారెక్ట‌ర్ల‌ని ప‌వ‌ర్ ఫుల్‌గా ప్ర‌జెంట్ చేయ‌డంతో `యానిమ‌ల్‌` దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్స్‌కి వ‌న్ ఆఫ్ ది ఫేవ‌రేట్ మూవీగా మారింది. ఇదే విష‌యాన్ని అక్ష‌య్ కుమార్ ఇండైరెక్ట్‌గా వ్య‌క్తం చేయ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి `స్పిరిట్‌`పై ప‌డింది.