Begin typing your search above and press return to search.

ఆ సినిమా ట్రైలర్ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన అక్షయ్ కుమార్!

అక్షయ్ కుమార్ తాజాగా తనపై సృష్టించబడిన ఒక ఫేక్ వీడియో గురించి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ.." అదంతా ఫేక్..ఎవరు నమ్మకండి" అంటూ అసలు విషయాన్ని బయట పెట్టారు.

By:  Madhu Reddy   |   23 Sept 2025 3:00 PM IST
ఆ సినిమా ట్రైలర్ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన అక్షయ్ కుమార్!
X

అక్షయ్ కుమార్ తాజాగా తనపై సృష్టించబడిన ఒక ఫేక్ వీడియో గురించి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ.." అదంతా ఫేక్..ఎవరు నమ్మకండి" అంటూ అసలు విషయాన్ని బయట పెట్టారు. మరి ఇంతకీ అక్షయ్ కుమార్ కి సంబంధించిన ఆ ఫేక్ వీడియో ఏంటి.. ? అక్షయ్ కుమార్ దానిపై ఏ విధంగా క్లారిటీ ఇచ్చారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మహర్షి వాల్మీకి పాత్రలో నటిస్తున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో యూట్యూబ్లో,సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారడంతో దీనిపై తాజాగా స్పందించారు అక్షయ్ కుమార్.. "నేను వాల్మీకి పాత్రలో నటిస్తున్నట్టు చక్కర్లు కొడుతున్న వీడియో పూర్తిగా ఫేక్ అని, అది ఏఐ ద్వారా రూపొందించబడింది.ఈ వీడియోని ఎవరు నమ్మకండి" అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు..

అక్షయ్ కుమార్ తన పోస్టులో ఏం రాసుకొచ్చారు అనే విషయాన్నికొస్తే.. "ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నా గురించి ఒక ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. నేను మహర్షి వాల్మీకి పాత్రలో నటిస్తున్నట్టు ఓ సినిమా ట్రైలర్ అంటూ రిలీజ్ చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోలు చూశాను.

ఇలాంటి వీడియోలన్నీ నకిలీవి.. అదంతా ఏఐ ఉపయోగించి సృష్టించబడ్డాయి. మరో దారుణం ఏంటంటే.. కొన్ని వార్త ఛానల్స్ అయితే ఇవి ఏఐ ద్వారా క్రియేట్ చేసినవా.. లేక నిజమేనా అని నమ్మకుండానే వాటిని వైరల్ చేస్తున్నారు.. ప్రస్తుత కాలంలో ఈ మోసపూరితమైన తప్పుదారి పట్టించే కంటెంట్ ఏఐ ద్వారా చాలా వేగంగా సృష్టించబడుతుంది.. ఏదైనా సమాచారం వస్తే అది నిజమని ధృవీకరించిన తర్వాత మాత్రమే వాటిని మీడియా ఛానల్ ప్రచురించాలి అని నేను ఆ మీడియా సంస్థలను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను" అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.. ఇక అక్షయ్ కుమార్ పెట్టిన పోస్ట్ తో అది ఏఐ వీడియో అని అందరికీ క్లారిటీ వచ్చింది..

ఇక అక్షయ్ కుమార్ నటించిన తాజా మూవీ జాలి ఎల్ఎల్బి-3..ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సుభాష్ కపూర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా కోర్టు రూమ్ కామెడీ డ్రామా జానర్ లో తెరకెక్కుతోంది.. ఈ మూవీ జాలి ఎల్ఎల్బి సిరీస్ మూడో భాగం.. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ అర్షద్ వార్సీ, సౌరబ్ శుక్లా, అమృత్ రావులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఏది ఏమైనా అక్షయ్ కుమార్ పై ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడంతో ఆయన అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా.. ఏఐ జనరేటర్ వీడియో అయినా చాలా బాగా చేశారు కదా భయ్యా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.