Begin typing your search above and press return to search.

విగ్గు లేకుండా యాక్ట్ చేయరా? నిర్మాతలంతా షాక్!

మొత్తం సినిమా అంతా విగ్గుతోనే కనిపించాలని, ఎలాంటి సీన్ లో కూడా నేచురల్ లుక్‌ లో ఉండబోనని అక్షయ్ ఖన్నా స్పష్టంగా చెప్పారని టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   13 Feb 2026 11:57 AM IST
విగ్గు లేకుండా యాక్ట్ చేయరా? నిర్మాతలంతా షాక్!
X

సినీ ఇండస్ట్రీలో హీరోల డిమాండ్లు కొత్తేమీ కాదు. కానీ కొన్ని కండిషన్స్ మాత్రం కొందరు నిర్మాతలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి! తాజాగా ఓ బాలీవుడ్ నటుడు పెట్టిన కండిషన్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. విగ్గు లేకుండా తెరపై కనిపించనని చెప్పి, కొన్ని సినిమా అవకాశాలను వదులుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా గురించే ఆ చర్చ సాగుతోంది. రోల్స్ సెలెక్షన్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఆ యాక్టర్, తన లుక్ విషయంలో మాత్రం రాజీ పడడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా విగ్గు తనకు లక్ గా ట్రీట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అది లేకుండా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్షయ్ ఖన్నాను రీసెంట్ గా పలువురు టాలీవుడ్ మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, పాత్రలో ఒదిగిపోయే తీరు వంటి విషయాల్లో మంచి పేరు సంపాదించుకున్న ఆయనతో చర్చలు జరిపినా.. అవి సక్సెస్ అవ్వలేదని తెలుస్తోంది. అందుకు కారణం విగ్గు అని ఇప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

మొత్తం సినిమా అంతా విగ్గుతోనే కనిపించాలని, ఎలాంటి సీన్ లో కూడా నేచురల్ లుక్‌ లో ఉండబోనని అక్షయ్ ఖన్నా స్పష్టంగా చెప్పారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా నిర్మాతలంతా షాక్ అయ్యారని సమాచారం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్టోరీ ప్రకారం రోల్ కు నేచురల్ లుక్ అవసరమైనా కూడా విగ్గు విషయంలో రాజీపడలేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఆయా నిర్మాతలు సైలెంట్ అయ్యారని సమాచారం. అలా ఇదే మొదటిసారి కాదని కూడా ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇలాంటి కండిషన్స్ వల్ల కొన్ని అవకాశాలు మిస్ అయ్యాయని టాక్ వినిపిస్తోంది. యాక్టింగ్ పరంగా మంచి పేరు ఉన్నప్పటికీ, ఇలాంటి రూల్స్ నిర్మాతలకు ఇబ్బందులుగా తెచ్చిపెడతాయని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరే అని విగ్గు కూడా ఓకే చెప్పినా.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వినికిడి.

ఏదేమైనా.. అక్షయ్ ఖన్నా అదిరిపోయే టాలెంట్‌ కు పాన్ ఇండియా రేంజ్ లో ప్రశంసలు అందుతున్నా, ఆయన పర్సనల్ రూల్స్ మాత్రం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విగ్గు సెంటిమెంట్ రీజన్ తో మంచి అవకాశాలను కోల్పోతున్నారా? లేక తన ఇమేజ్‌ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? అన్న విషయాలపై అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఫ్యూచర్ అని సినిమాల్లో కూడా అక్షయ్ ఖన్నా విగ్గులో కనిపిస్తారేమో మరి.