వివాదంలో చిక్కుకున్న 'ధురంధర్' స్టార్!
`దృశ్యం 3` నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ తాజాగా అక్షయ్ ఖన్నాపై దావా వేసి షాక్ ఇచ్చారు.
By: Tupaki Entertainment Desk | 27 Dec 2025 11:08 PM ISTరణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్`. ఇండియపై పాక్ తీవ్రవాదులు, స్మగ్లర్స్‌తో కలిసి ఐఎస్ ఐ ఆడిన చదరంగం, సృష్టించిన మారణహోమం, పన్నిన కుట్రలు, వాటి వెనక దాగివున్న వాస్తవ సంఘటనలని ప్రధానాంశాలుగా తీసుకుని వాస్తవిక నేపథ్యంలో రూపొందించిన `ధురంధర్` మూవీ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఆదిత్యధర్ రూపొందించిన ఈ మూవీతో రణ్‌వీర్ సింగ్‌తో పాటు రో నటుడు కూడా వైరల్ అవుతున్నాడు. తనే అక్షయ్‌ఖన్నా. తను ఈ మూవీలో సల్మాన్ డకాయత్‌గా తనదైన మార్కు హావభావాలతో టెర్రిఫిక్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అనిపించుకుంటున్నాడు. నెట్టింట తన క్యారెక్టర్‌కు సంబంధించిన విజువల్స్, డ్యాన్స్‌స్టెప్ వైరల్ అవుతూ అక్షయ్ ఖన్నాని ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. ఇదిలా ఉంటే `ధురంధర్` మూవీతో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న అక్షయ్ ఖన్నా ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు.
`దృశ్యం 3` నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ తాజాగా అక్షయ్ ఖన్నాపై దావా వేసి షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు లీగల్ నోటీసులు పంపించినట్టు వెల్లడించారు. అంతే కాకుండా అక్షయ్ ఖన్నా `దృశ్యం 3` కోసం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని, సినిమాలో భాగం కావడం లేదని, టెక్స్ట్ మెసేజ్ పంపించారని నిర్మాత ఆరోపించారు. అక్షయ్‌తో `దృశ్యం 3` సినిమాకు సంబంధించిన ఒప్పందం జరిగిందని, అప్పుడే ఆయనకు కొంత మొత్తంలో అడ్వాన్స్ చెల్లించానని తెలిపారు.
అయితే షూటింగ్‌పై ప్రభావం పడటంతో ఆయన స్థానంలో జైదీప్ అహ్లావత్‌ని తీసుకున్నట్టుగా వెల్లడించారు. రెండేళ్లుగా `దృశ్యం 3` కోసం పని చేస్తున్నాం. ఆ విషయం అక్షయ్ ఖన్నాకు తెలుసు. స్క్రిప్ట్ మొత్తం విన్నప్పుడు అతనికి నచ్చింది. అన్నీ మాట్లాడుకున్న తరువాతే ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాం. కానీ ఒకరోజు ఈ సినిమా తాను చేయట్లేదని అక్షయ్ ఖన్నా మెసేజ్ పెట్టారని, అతడిని సంప్రదించాలని ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ `దృశ్యం 3` షూటింగ్‌ని దాదాపుగా పూర్తి చేసి సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కథకు సంబంధం లేకుండా అజయ్ దేవ్‌గన్‌తో `దృశ్యం 3`ని కుమార్ మంగత్ పాఠక్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం అక్షయ్ ఖన్నాని అనుకున్నారు. `దృశ్యం 2`లో నటించిన అక్షయ్ పార్ట్ 3లో నటించడానికి విముఖత చూపించడంతో ఇప్పుడు వివాదం మొదలైంది.
