Begin typing your search above and press return to search.

హెయిర్ కంటే ట్యాలెంట్ నే న‌మ్ముకున్న న‌టుడు!

ట్యాలెంట్ తో ఎలా ఎదిగాలో దృష్టి పెట్టాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో తండ్రి వినోద్ ఖన్నా నిర్మించి, నటించిన `హిమాలయ పుత్ర‌` చిత్రంతో అక్షయ్ ఖాన్నా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.

By:  Srikanth Kontham   |   18 Dec 2025 9:00 PM IST
హెయిర్ కంటే ట్యాలెంట్ నే న‌మ్ముకున్న న‌టుడు!
X

సినిమా న‌టుడు అవ్వాలంటే? అందంగా ఉండాలి. మంచి హైట్..వెయిట్..హెయిర్ స్టైల్, బాడీ షేప్ ఇలా కొన్ని కొల‌మానాలు అవ‌స‌రం. అవి ఉంటేనే స్టార్ అవుతాడా? అంటే అలాగ‌ని గ‌ట్టిగా చెప్ప‌లేం. ఇండ‌స్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే? ఇవేవి లేక‌పోయినా ప‌ర్వాలేదు. కొంత వ‌ర‌కూ ప్రేక్ష‌కులు అంగీక‌రిస్తారు. ఆ త‌ర్వాత కాలంలో మాత్ర ప్ర‌తిభ‌తోనే నెట్టుకురావాల్సి ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లేని న‌టుడికి అయితే పైన చెప్పిన కొల‌మానాల‌న్నీ త‌ప్ప‌నిస‌రి. అవ‌న్నీ ప‌క్క‌న బెడితే ప్ర‌ముఖంగా మంచి హెయిర్ స్టైల్ మాత్రం ఎలాంటి న‌టుడికైనా కీల‌కం.

అందుబాటులో విగ్గులు చాలా కాలంగా ఉన్న‌వి. హేయిర్ ట్రాన్ప‌ప్లంటేష‌న్...హెయిర్ ప్యాచ్ లు లాంటివి ఇప్పుడొచ్చిన‌వి. అప్ప‌ట్లో తల లేని న‌టులుంతా విగ్గులు ధ‌రించే కెమారా ముందుకొచ్చేవారు. దీంతో లుక్ ప‌రంగా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడిదంతా ఎందుక‌నుకుంటున్నారా? అయితే అస‌లు విష‌యంలోకి వెళ్లాల్సిందే. దివంగత నటుడు వినోద్ ఖన్నా త‌న‌యుడిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అక్ష‌య్ ఖ‌న్నా ఎంత ఫేమ‌స్ న‌టుడో చెప్పాల్సిన ప‌నిలేదు. `ఛావా`, `ధురంధ‌ర్` లాంటి చిత్రాల‌తో తెలుగు ఆడియ‌న్స్ కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.

`ధురంధ‌ర్` లో అత‌డి, న‌ట‌న స్వాగ్ కి ఫిదా కాని ప్రేక్ష‌కులు ఉండ‌రు. అలాంటి న‌టుడు కూడా బ‌ట్ట‌త‌ల‌తో ఇబ్బంది ప‌డ్డాడు? అన్న‌ది ఎంత మందికి తెలుసు? అవును అక్ష‌య్ ఖ‌న్నాకి చిన్న వ‌య‌సులోనే అంటే 19 ఏళ్ల‌కే నెత్తిమీద జుట్టు ప‌ల‌చ‌బ‌డ‌టం మొద‌లైంది. దీంతో బాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌స్తాయో? రావో ? అన్న ఆందోళ‌న అత‌డిని వెంటాడింది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఫాలింగ్ మాత్రం ఆగ‌లేదు. రోజు రోజుకు త‌ల ఉడ‌టం పెరుగుతూనే ఉంది. దీంతో కొన్ని రోజుల‌కు హెయిర్ లాస్ అవుతున్నాను? అనే బాధ‌ను వ‌దిలేసాడు.

ట్యాలెంట్ తో ఎలా ఎదిగాలో దృష్టి పెట్టాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో తండ్రి వినోద్ ఖన్నా నిర్మించి, నటించిన `హిమాలయ పుత్ర‌` చిత్రంతో అక్షయ్ ఖాన్నా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. కానీ ఈ సినిమా విజ‌యం సాధించ‌లేదు. అనంత‌రం న‌టించిన `బోర్డ‌ర్` చిత్రంతో మంచి విజ‌యం అందుకున్నాడు. అప్ప‌టి నుంచి అక్ష‌య్ ఖ‌న్నా బాలీవుడ్ లో వెనుదిరిగి చూడ‌లేదు. స‌హాయ న‌టుడిగా, విల‌న్ గా విభిన్న పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. `దిల్ చాహ్తా హై`, `హమ్‌రాజ్`, `రేస్`, `దృశ్యం 2` లాంటి చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. మూడేళ్ల గ్యాప్ అనంత‌రం `ఛావా`తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తాజాగా `ధురంధ‌ర్` లో రెహ‌మాన్ డెకాయ‌త్ పాత్ర‌తో ప్రేక్ష‌కులకు పిచ్చెక్కించాడు.