Begin typing your search above and press return to search.

తండ్రి కొడుకు ఒకే నెల అవసరమా?

అక్కినేని అభిమానులకు 2026 డిసెంబర్‌లో డబుల్ ధమాకా ఎదురుకానుంది. నాగ చైతన్య నటించిన ‘వృషకర్మ’ డిసెంబర్ 4న, నాగార్జున 100వ సినిమా ‘కింగ్ 100’ డిసెంబర్ 24న విడుదల కానున్నాయి. తండ్రీకొడుకుల సినిమాలు ఒకే నెలలో మూడు వారాల గ్యాప్‌తో రావడం విశేషంగా మారింది. రెండు సినిమాలు విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

By:  Ramesh Palla   |   14 Nov 2026 12:03 PM IST
తండ్రి కొడుకు ఒకే నెల అవసరమా?
X

అక్కినేని ఫ్యాన్స్‌కి 2026 డిసెంబర్‌ నెలలో డబుల్‌ ధమాకా ఉండబోతుంది. ఇప్పటికే నాగార్జున నటించిన 100వ సినిమా 'కింగ్‌ 100'తో పాటు నాగ చైతన్య నటించిన 'వృషకర్మ' సినిమా విడుదలకు రెడీ అయ్యాయి. ఈ రెండు సినిమాలను డిసెంబర్‌ నెలలో విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. టాలీవుడ్‌లో ఒక పెద్ద హీరో సినిమా వస్తున్న సమయంలో మరో పెద్ద హీరో సినిమాను కాస్త అటు లేదా ఇటు వాయిదా వేయడం మనం చూస్తున్నాం. అయితే నాగార్జున, నాగ చైతన్య సినిమాలు ఒకే నెలలో రావడం ను అభిమానులు ఒక వైపు ఆనందంతో స్వీకరిస్తూ ఉంటే, కాస్త ఎక్కువ గ్యాప్‌ ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కొడుకు సినిమాలు, అది కూడా ఇద్దరు హీరోలుగా నటించిన వేరు వేరు సినిమాలు ఒకే నెలలో రావడం అనేది అరుదైన విషయం. ఆ అరుదైన రికార్డ్‌ అక్కినేని హీరోలకు దక్కిందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

నాగ చైతన్య వృషకర్మ మూవీ...

నాగ చైతన్య నటించిన వృషకర్మ సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విరూపాక్ష సినిమా ఫేం కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన 'వృషకర్మ' సినిమాను డిసెంబర్‌ 4, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ అండ్‌ అడ్వెంచర్‌ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా కీలక పాత్రల్లో జయరామ్‌, స్పర్ష్‌ శ్రీవాస్తవలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఒక వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతూ వచ్చాయి. నాగ చైతన్య అభిమానులు మాత్రమే కాకుండా మైథలాజికల్‌ థ్రిలర్స్‌ ను ఇష్టపడే ప్రేక్షకులు వృషకర్మ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విరూపాక్ష సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధించిన కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

నాగార్జున కింగ్‌ 100 సినిమాతో...

ఇక నాగార్జున 'కింగ్‌100' సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్‌ కెరీర్ లో ఈ సినిమాను 100వ సినిమాగా పేర్కొనడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమా రా కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందింది. తెలుగు ప్రేక్షకులకు ఆయన కొత్త వాడే అయినప్పటికీ మంచి ప్రతిభావంతుడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు టబు, అశోక్‌ సెల్వన్‌, ఐశ్వర్య రాజేష్‌ లు ముఖ్య పాత్రల్లో నటించారు. నాగార్జున, టబు కాంబో మూవీ చాలా కాలం తర్వాత వస్తున్న నేపథ్యంలో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. కింగ్‌100 సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు సైతం ప్రారంభం అయినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అక్కినేని హీరోల సినిమాలు...

నాగ చైతన్య వృషకర్మ సినిమా డిసెంబర్‌ 4న విడుదల కానుండగా, కింగ్‌ 100 సినిమాను డిసెంబర్‌ 24న విడుదల చేయబోతున్నారు. ఒకే నెలలో రెండు అక్కినేని హీరోల సినిమాలు విడుదల అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్న ఈ సమయంలో ఆయా సినిమాల నిర్మాతలు, యూనిట్‌ సభ్యులు స్పందిస్తూ మూడు వారాల సమయం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా విడుదలై సూపర్‌ హిట్‌ అయినా రెండు మూడు వారాల కంటే ఎక్కువ రోజులు వసూళ్లు రాబట్టలేక పోతున్నాయి. మూడు వారాల తర్వాత కూడా వసూళ్లు వస్తున్నాయి అంటే ఆ సినిమా చాలా పెద్ద హిట్‌గా చెప్పుకుంటున్నారు. కానీ ఆ రేంజ్ హిట్‌ సాధిస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు.

నాలుగో వారంలో ఎలాగూ వృషకర్మకు వసూళ్లు తగ్గుతాయి కనుక కింగ్‌ 100 వచ్చినా ఇబ్బంది లేదు అనేది విశ్లేషకుల మాట. కనుక ఒకే నెలలో వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేదు. మూడు వారాల గ్యాప్‌ లో వృషకర్మ పూర్తి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది, కనుక కింగ్‌ 100 వచ్చినా ఇబ్బంది ఉండదు. రెండు సినిమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు వారాల గ్యాప్‌ లో విడుదల కాబోతున్నాయి. రెండు సినిమాలు హిట్‌ కావాలి, చాలా కాలంగా అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆ మూమెంట్‌ రావాలని అంతా కోరుకుంటున్నారు.