ఫ్యాన్స్ తో అక్కినేని బాండింగ్ ఎంతలా ఉందంటే?
అక్కినేని కుటుంబ అభిమానుల ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం ఒక హీరోకు సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు.
By: M Prashanth | 25 July 2026 11:29 AM ISTఅభిమాని కళ్లలో హ్యాపీ నెస్.. హీరో కళ్లలో అఫెక్షన్.. ఆ రెండు కలిసిన మూమెంట్స్ ఎప్పుడూ స్పెషలే. అక్కినేని ఫ్యామిలీకి, వారి అభిమానులకు మధ్య ఉన్న రిలేషన్ కూడా అలాంటిదే. కేవలం సినిమా విడుదలల వరకు మాత్రమే పరిమితం కాని ఆ రిలేషన్.. జెనరేషన్లసు మారినా కొనసాగుతూనే ఉంది. తాజాగా అఖిల్ అక్కినేని చేసిన కామెంట్స్ మరోసారి అక్కినేని ఫ్యాన్ బేస్ స్పెషాలిటీని గుర్తు చేశాయి.
తన ఫ్యాన్స్ తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని అఖిల్ అక్కినేని చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరితో మాట్లాడలేకపోయినా.. కొందరు అభిమానులతో మాత్రం ప్రత్యేకంగా కమ్యూనికేట్ చేస్తుంటానని ఆయన తెలిపారు. అభిమానులు లేకపోతే తాము ఈ రేంజ్ లో ఉండేవాళ్లం కాదంటూ అఖిల్ చేసిన కామెంట్స్ హీరో, అభిమానుల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి.
ఇటీవల లెనిన్ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా అఖిల్ తన వీరాభిమాని నాగరాజును కలిశారు. అఖిల్ ను ఎప్పటి నుంచో చూడాలని ఎదురుచూస్తున్న నాగరాజు.. తన అభిమాన హీరోను కలిసిన సమయంలో ఎమోషనల్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ అభిమానులకు, హీరోలకు మధ్య ఉండే అనుబంధానికి ఒక ఉదాహరణగా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీకి అభిమానులతో ఉన్న రిలేషన్ కొత్తదేం కాదు.
దాదాపు ఏడు దశాబ్దాలుగా ఆ ఫ్యామిలీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కాలం నుంచే ఆ జర్నీ మొదలైంది. ఏఎన్నార్ కుటుంబ ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. ప్రేమ, కుటుంబ విలువలు, భావోద్వేగాలతో కూడిన సినిమాలతో ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయన డిసిప్లైన్, పర్సనాలిటీ అభిమానులను మరింత దగ్గర చేసింది.
ఆ తర్వాత నాగార్జున తనదైన శైలిలో ఆ ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు. శివతో మాస్ ఇమేజ్ సంపాదించిన ఆయన.. అన్నమయ్య, మన్మథుడు వంటి విభిన్న సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యారు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా నాగార్జునకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మూడో జెనరేషన్ లో నాగచైతన్య, అఖిల్ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాగచైతన్య ప్రేమకథలు, యూత్ ఫుల్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించగా.. అఖిల్ కూడా ప్రత్యేకమైన ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.
అక్కినేని కుటుంబ అభిమానుల ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం ఒక హీరోకు సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు. ఒక కుటుంబంతో ప్రేక్షకులకు ఏర్పడిన రిలేషన్. తాతను అభిమానించిన కుటుంబాలు.. ఇప్పుడు మనవళ్ల సినిమాలను కూడా అదే ప్రేమతో ఆదరిస్తున్నాయి. మూడు జెనరేషన్ల అక్కినేని హీరోలు కలిసి నటించిన ‘మనం’ సినిమా కూడా ఆ రిలీషేన్ కు సింబల్ గా నిలిచింది. కుటుంబం, అభిమానులు, సినిమా అనే మూడు అంశాలను కలిపిన అరుదైన సందర్భంగా అది గుర్తుండిపోయింది. అందుకే అక్కినేని ఫ్యామిలీకి అభిమానులు కేవలం ఆడియన్స్ కాదు.. వారి జర్నీలో పార్టనర్స్ అంట!
