Begin typing your search above and press return to search.

ఓజీలో అకీరా ఎందుకు లేడు? కారణం ఇదేనా?

అయితే సినిమాలో ఈ పాత్ర పోషించిన ఆకాశ్‌ శ్రీనివాస్‌ తాజాగా స్పందించాడు. దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

By:  M Prashanth   |   1 Oct 2025 8:12 PM IST
ఓజీలో అకీరా ఎందుకు లేడు? కారణం ఇదేనా?
X

స్టార్ హీరోల కొడుకులు, కూతుళ్ల అరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు. అందులో అత్యంత మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్న డెబ్యూల్లో ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అకీరా నందన్ ది. అకీరా ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై కనిపిస్తాడా అని మెగా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు.

అయితే పవన్ రీసెంట్ సినిమా ఓజీలో అకీరా క్యామియో రోల్ చేశాడని, అతడి పాత్రను దర్శకుడు సుజిత్ అద్భుతంగా డిజైన్ చేశారని ప్రచారం సాగింది. ముఖ్యంగా ఇందులో ఓజస్ గంభీర యంగ్ ఏజ్ ను కూడా చూపించడంతో అధే రోల్ లో అకీరా ఉంటాడని అనుకున్నారు. కానీ, ప్రచారాలు అబద్దం అయ్యాయి. అకీరా ఓజీలో నటించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

టీనేజర్ గా ఓజీని అకీరను చూపిస్తే బాగుండేదని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాలో ఈ పాత్ర పోషించిన ఆకాశ్‌ శ్రీనివాస్‌ తాజాగా స్పందించాడు. దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పనన్ కంటే అకీరా ఎక్కువ ఎత్తు ఉండడంతోనే తనను తీసుకోకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. దీనిపై రీసెంట్ గా మాట్లాడాడు. ఏ వయసులో అయినా మనిషి ఎదుగుదల ప్రకారమే ఎత్తు పెరుగుతుంది. అయితే అకీరా ఆరున్నర అడుగులు ఉంచాడు. అంటే పవన్ కంటే ఎక్కువ.

టీజేజర్ ఓజీగా అకీరా చేస్తే ఎత్తు ఎక్కువగా ఉంటాడు. దీంతో పెద్దయ్యాక ఓజీ పాత్రలో పవన్ తక్కువ ఎత్తు ఉంటే ప్రేక్షకులు లాజిక్ పట్టుకుంటారు. అందుకే అకీరాతో ఈ పాత్ర చేయించలేదని సుజిత్ అనుకున్నట్లు చెప్పాడు. అలాగే అకీరా డెబ్యూకు ఇది సరైన సమయం కాదని, తనను ఇలా లాంచ్ చేయడం కరెక్ట్ కాదని భావించాడట. అందుకే అకీరా అరంగేట్రం ఓజీతో జరగలేదు.

ఆకాశ్‌ శ్రీనివాస్‌ చెప్పిన ఈ కారణం కరెక్ట్ అని సినీ వర్గాలు అంటున్నాయి. తెరపై హీరో బాల్యం పాత్ర కంటే పెద్దయ్యాక నటుడి పొడవుగా తక్కువగా కనబడితే సీన్స్‌ సహజంగా ఉండవని అంటున్నారు. మరోవైపు, యంగ్ ఓజీ పాత్ర కొద్దిసేపే ఉన్నా.. అది ఇంపాక్ట్ చూపించింది. ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 25న రిలీజైన ఈ సినిమా తొలి రోజు రూ.154 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా సాధించింది.