Begin typing your search above and press return to search.

OG సీక్వెల్ లో అకీరానందన్.. సుజిత్ రిప్లై ఇదే

ఈ విషయం గురించి మీరు పవన్‌ కళ్యాణ్ ను అడగాలి. అయినా ఓజీ 2 సినిమా అకీరాతో తీస్తే హ్యాపీనే కదా. ప్రస్తుతం అయితే అంతా ఓజీ వైబ్ ఎంజాయ్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   26 Sept 2025 11:43 AM IST
OG సీక్వెల్ లో అకీరానందన్.. సుజిత్ రిప్లై ఇదే
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఆయన నుంచి చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ చిత్రం రావడంతో అభిమానులు ఈ వైబ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు ఇండియాలోనే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లోనూ మంచి ఓపెనింగ్సే వసూళ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ సినిమా సీక్వెల్ విషయం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.

అయితే దర్శకుడు సుజీత్‌ ఇప్పటికే ఓజీ సీక్వెల్ పై మాట్లాడారు. కచ్చితంగా ఓజీకి కొనసాగింపుగా పార్ట్ 2 ఉంటుందని అన్నారు. కానీ ఎవరితో అనే దానిపై క్లారిటీగా చెప్పలేదు. ఈ క్రమంలో ఓజీ పార్ట్ 2 పవన్ కుమారుడు అకీరా నందన్ తో తీస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి దర్శకుడు సుజీత్‌ సమాధానమిచ్చారు. మరి ఆయన ఏమన్నారంటే?

ఈ విషయం గురించి మీరు పవన్‌ కళ్యాణ్ ను అడగాలి. అయినా ఓజీ 2 సినిమా అకీరాతో తీస్తే హ్యాపీనే కదా. ప్రస్తుతం అయితే అంతా ఓజీ వైబ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాను అందరూ ఎంజాయ్‌ చేసిన తర్వాతే సీక్వెల్‌ కు సంబంధించిన ఏవైనా విషయాలు బయటకు వస్తాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో అకీరా కూడా సెట్స్‌ కు వచ్చాడు. తనలో కూడా ఓ స్పార్క్‌ ఉంది. ఇంతకుమించి ఇప్పుడే నేనేం చెప్పలేను.

నేను ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడినా, ఏది చెప్పినా.. అది ఇంకా ఎక్కడికో వెళ్తుంది. అందుకే ఈ విషయంపై నేను ఇప్పుడే ఎక్కువగా మాట్లాడను. దానికి ఇంకా టైమ్ ఉందిలే అని డైరెక్టర్ సుజిత్ రిప్లై ఇచ్చారు. ఇక సుజిత్ ఆన్సర్ తో మెగా ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. సీక్వెల్ లో అకీరా ఉంటాడు అన్నట్లే సుజిత్ సమాధానం ఉండడంతో పండగ చేసుకుంటున్నారు. కచ్చితంగా సీక్వెల్‌ లో అకీరా కనిపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

కాగా, తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఓజీ సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే కేవలం పీవీఆర్ ఐనాక్స్ మల్టిప్లెక్స్ లో రెండు లక్షల టికెట్లు బుకింగ్ అయినట్లు తెలిసింది. అటు ఓవర్సీస్ లోనూ డే 1 లోపై 3 మిలియన్ డాలర్ల వసూల్ సాధించింది. ఇంకా ఓవర్సీస్ లో బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఈ వీకెండ్ లోనే అది నాలుగు మిలియన్ మార్క్ కు చేరుకునే కనిపిస్తుంది. ఇటు భారత్ లోనూ తొలి రోజు భారీగానే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈజీగా రూ.100 కోట్ల వసూళ్లు ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.