అకీరా లాంచింగ్ అతడికీ ఛాన్స్!
మెగా వారసుడు అకీరా నందన్ లాంచింగ్ పై రెండేళ్ల కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ అకీరా ఇంకా లాంచ్ అవ్వలేదు.
By: Srikanth Kontham | 4 Oct 2025 3:00 PM ISTమెగా వారసుడు అకీరా నందన్ లాంచింగ్ పై రెండేళ్ల కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ అకీరా ఇంకా లాంచ్ అవ్వలేదు. అయితే చిత్ర పరిశ్రమలోనే ఎక్కువగా తిరుగుతున్నాడు. మెగా ఫ్యామిలీలో ఎక్కువగా కనిపి చండం...సినిమావాళ్లతో రిలేషన్స్ షిప్స్ వంటివి మెయింటెన్ చేస్తున్నాడు. మామ్ దగ్గరే ఎక్కువగా ఉండే అకీరా రీ రెండేళ్లగా ఎక్కువగా పవన్ కళ్యాణ్ తోనే ఉంటున్నాడు. సినిమా ఈవెంట్లకు హాజరవ్వడం... స్టార్ డైరెక్టర్లతో మాట మంతి వంటి ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు. తనకిష్టమైనా గిటార్ ను కూడా పక్కనబెట్టినట్లే కనిపిస్తోంది.
సుజిత్ ని మెచ్చిన పీకే:
సంగీతమంటే ఇష్టపడే అకీరా ఈ మధ్య కాలంలో మీడియా కెమెరా ముందు అలా కనిపించడం లేదు. పక్కా హీరో కటౌట్ మాత్రమే హైలైట్ అవుతుంది. అకీరాఎంట్రీ విషయంలో బ్యాకెండ్ వర్క్ కూడా జరుగుతోంది. మరి `ఓజీ` సక్సెస్ వేళ అకీరా బాద్యతలు పీకే... సుజిత్ కి అప్పగించే అవకాశం ఉందా? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. `ఓజీ`ని పవన్ ఎంతగా ఇష్టపడి చేసారు అన్నది అతడి మాటల్లోనే బయట పడింది. సుజిత్ లాంటి డైరెక్టర్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చే వాడిని కాదన్నారు? అంటే `ఓజీ`ని పీకే ఎంత లైక్ చేసారు?
ఓజీ2 లో అకీరా:
ఆ తరహా కంటెంట్ ని ఎంతగా ఇష్ట పడుతున్నారు? అన్నది అద్దమవుతుంది. మరి ఇంత లైక్ చేసిన డైరెక్టర్ కే తనయుడిని లాంచింగ్ బాధ్యతలు అప్పగిస్తే సరి అనుకోవచ్చుగా? అవును ఇప్పుడిదే డిస్కషన్ మెగా ఫ్యామిలీలో కూడా జరిగిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. `ఓజీ 2` కూడా ఉంటుందని పవన్ -సుజిత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పవన్ ఆ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతారా? లేదా? అన్నది చివరి వరకూ గానీ క్లారిటీ రాదు.
ఛాన్స్ ఉందా? లేదా?
పవన్ నిరణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని నేపథ్యంలో ఈ సందేహం తలెత్తుంది. ఒకవేళ పవన్ కి వీలు కాని నేపథ్యంలో `ఓజీ 2` లో అకీరా నందన్ లీడ్ రోల్ పోషించినా? ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ప్రచారం మొదలైంది. ఎలాగూ సీక్వెల్ కాబట్టి హీరో మారినా? పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎలాగూ పవన్ కుమారుడే కాబట్టి అభిమానులు కూడా ఎలాంటి అడ్డు చెప్పరు. అప్పుడు పవన్ కంటే ఎక్కువ బజ్ అకీరా ఎంట్రీతో నే సాధ్య మవుతుంది. ప్రేక్షకులకు అకీరా ఎంట్రీ ఓ థ్రిల్లింగ్ లా అనిపిస్తుంది. మరి అందుకు ఆస్కారం ఉందా? లేదా? అన్నది భవిష్యత్ ప్రణాళికను బట్టి తేలుతుంది.
