Begin typing your search above and press return to search.

అకీరా ఎంట్రీ సెన్సేష‌న్ అవ‌డం ఖాయం.. శేష్ కామెంట్స్ వైరల్!

అకీరా కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన విదేశాల్లో మ్యూజిక్ స్టడీస్‌పై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం.

By:  Sravani Lakshmi Srungarapu   |   26 April 2026 11:48 AM IST
అకీరా ఎంట్రీ సెన్సేష‌న్ అవ‌డం ఖాయం.. శేష్ కామెంట్స్ వైరల్!
X

టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా చర్చలో ఉన్న స్టార్ కిడ్ డెబ్యూ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా పవర్ స్టార్ కుటుంబానికి చెందిన అకీరా నందన్ ఎంట్రీ ఎప్పుడుంటుంద‌నే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేకపోవడం ఆసక్తిని మరింత పెంచుతోంది. సంవత్సరాలుగా వస్తున్న రూమర్స్, సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలు ఇవ‌న్నీ కలిపి అకీరా డెబ్యూ చుట్టూ ఒక మిస్టరీని క్రియేట్ చేశాయి. అధికారిక ప్రకటన ఒక్కటీ లేకపోయినా, ఫ్యాన్స్ హైప్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటుడు అడివి శేష్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీశాయి. తన సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన శేష్, అకీరా ఎంట్రీపై డైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వకపోయినా, అతను ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, అది సెన్సేషన్ అవుతుంద‌ని చెప్పడంతో ఆ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పటికే సెటిలైన‌ నటుడిగా శేష్ చెప్పిన ఈ మాటలు ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచాయి. అకీరా- శేష్ మధ్య పర్సనల్ కనెక్షన్ కూడా ఉంది. తాము అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటామ‌ని, తామిద్దరికీ లెఫ్ట్ హ్యాండెడ్ అనే కామన్ పాయింట్ ఉందని శేష్ చెప్పడం స్టోరీకి హ్యూమన్ టచ్ ను తీసుకొచ్చింది. స్టార్ కిడ్‌గా కాకుండా, ఒక సాధారణ యువకుడిగా అకీరా వ్యక్తిత్వాన్ని చూపించే ఈ వివరాలు అతనిపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా అకీరా మెచ్యూరిటీ, గ్రౌండెడ్ నేచర్‌పై శేష్ ఇచ్చిన కాంప్లిమెంట్స్, అతను ఫ్యూచ‌ర్‌లో ఏ రంగం ఎంచుకున్నా స్పెష‌ల్ గా నిలుస్తాడనే సంకేతాలను ఇస్తున్నాయి.

అకీరా కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన విదేశాల్లో మ్యూజిక్ స్టడీస్‌పై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. యాక్టింగ్ లోకి రావాలా, లేక మ్యూజిక్‌లోనే తన ఫ్యూచ‌ర్ ను చూసుకోవాలా అనే విషయంలో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం అతడిని హీరోగా చూడాలని కోరుకుంటుంటే, త‌న ఫ్యామిలీ మాత్రం ఈ విష‌యంలో పూర్తి నిర్ణయం అతనిదేనని అంటున్నారు.

స్టార్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, అకీరా తనదైన గుర్తింపును ఏర్పరచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడనే భావన కనిపిస్తోంది. పబ్లిక్‌గా ఎక్కువగా కనిపించకపోయినా, తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటూ సైలెంట్‌గా ప్రిపేర్ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అకీరా ఎంట్రీ డిలేకు ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. మొత్తంగా చూస్తే, అధికారిక ప్రకటన లేకపోయినా అకీరా నందన్ డెబ్యూ చుట్టూ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ థియరీలు, ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు ఇవ‌న్నీ అత‌ని డెబ్యూపై అంచ‌నాల్ని ఇంకా పెంచుతున్నాయి. ఈ క్రమంలో అడివి శేష్ చేసిన సెన్సేషన‌ల్ ఎంట్రీ కామెంట్ ఈ అంచనాలకు మరింత బలాన్ని చేకూర్చింది.