Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత తొలిసారి భార్యతో దర్శనమిచ్చిన అక్కినేని అఖిల్.. క్యూట్ జోడీ!

ఇద్దరూ సంప్రదాయమైన దుస్తులు ధరించి దివాళీని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి జైనాబ్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

By:  Madhu Reddy   |   23 Oct 2025 12:36 PM IST
పెళ్లి తర్వాత తొలిసారి భార్యతో దర్శనమిచ్చిన అక్కినేని అఖిల్.. క్యూట్ జోడీ!
X

అక్కినేని అఖిల్ - జైనాబ్ రవ్జీలు ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.. వీరి పెళ్లి ఈ ఏడాది జూన్ 6న నాగార్జున ఇంట్లో కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి సింపుల్ గా సన్నిహితుల మధ్య చేసుకున్నప్పటికీ రిసెప్షన్ ని మాత్రం గ్రాండ్ గా అరేంజ్ చేశారు.. అయితే పెళ్లయ్యాక జైనాబ్ - అఖిల్ లకు ఈ ఏడాది మొదటి దీపావళి కాబట్టి వీరు ఈ మొదటి దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే తాజాగా జైనాబ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో భర్తతో కలిసి దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంది..





ఇద్దరూ సంప్రదాయమైన దుస్తులు ధరించి దివాళీని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి జైనాబ్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలలో అక్కినేని అఖిల్ నేవీ బ్లూ కలర్ కుర్తా వేసుకోగా.. జైనాబ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో శారీలో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో పాటు కొత్తజంటకి చాలామంది దివాళీ విషెస్ చెబుతూ చిలకా గోరింకల్లా మీ జంట అద్భుతంగా ఉంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జైనాబ్ తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేయడమే కాకుండా "మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఈ సంవత్సరం ఆరోగ్యం,శాంతి, శ్రేయస్సు తో ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం జైనాబ్ పెట్టిన ఈ పోస్ట్ ఇన్స్టా లో వైరల్ గా మారింది.

ఇక అక్కినేని ఫ్యామిలీలోకి కోడళ్లుగా అడుగుపెట్టిన శోభిత ధూళిపాళ్ల, జైనాబ్ ల గురించి రీసెంట్ గానే అక్కినేని అమల ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.నా కోడళ్లు ఇద్దరు బంగారం అన్నట్లుగా అమల వారిని పొగుడుతూ మాట్లాడింది.. అక్కినేని అఖిల్ గురించి చూసుకుంటే.. మొదట అక్కినేని అఖిల్ శ్రియా భూపాల్ ని ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి సమయం వచ్చే లోపే వీరి మధ్య విభేదాలు వచ్చి ఇద్దరు ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు. అలా పెళ్లి పీటలకు వెళ్లిన వీరి బంధం మధ్యలోనే చెడిపోయింది.

శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నాక అక్కినేని అఖిల్.. జైనాబ్ తో ప్రేమలో పడ్డారని,చాలా సంవత్సరాల నుండి వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి.అలా వీరి ప్రేమను ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో ఈ ఏడాది వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్జీ తో నాగార్జునకి చాలా సంవత్సరాల నుండి సాన్నిహిత్యం ఉందట. అలా వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో అఖిల్ జైనాబ్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక అఖిల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ హీరో లెనిన్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు.