అఖిల్ వదిలేసిన స్క్రిప్ట్.. ఈ హీరో దగ్గరకు వచ్చిందా?
దీంతో సిద్ధు కోసం అనిల్ ఎలాంటి స్టోరీ రెడీ చేశారోనన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 15 March 2026 12:47 PM ISTటాలీవుడ్ లో హీరోలు, దర్శకుల మధ్య కథలు మారడం కొత్త విషయం కాదు. ఒక హీరో కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్ మరో హీరో దగ్గరకు వెళ్లి సినిమాగా రూపుదిద్దుకున్న సందర్భాలు గతంలో కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి సీన్ రిపీట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరో అక్కినేని అఖిల్ కోసం అనుకున్న కథ.. మరో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ దగ్గరికి వెళ్లిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
డెబ్యూ డైరెక్టర్ అనిల్ కుమార్ ఒక కథను మొదట అక్కినేని అఖిల్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని రోజుల క్రితం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించాలని చర్చలు జరిగినట్లు సమాచారం. కానీ కథ, కాన్సెప్ట్ పరంగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. సినిమా బడ్జెట్ విషయంలో అప్పట్లో కొన్ని సమస్యలు తలెత్తినట్లు వినికిడి. దీంతో సినిమా ముందుకెళ్లలేదని టాక్.
కానీ దర్శకుడు అనిల్ కుమార్ మాత్రం ఆ కథను వదిలేయకుండా కొన్ని మార్పులు చేసి మళ్లీ కొత్తగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇటీవల సిద్ధు.. మూడు కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అందులో ఒకటి అనిల్ కుమార్ తో మూవీ అని వినికిడి.
దీంతో సిద్ధు కోసం అనిల్ ఎలాంటి స్టోరీ రెడీ చేశారోనన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ రాసుకున్న కథలో మార్పులు చేర్పులు చేసి.. ఆ స్టోరీనే సిద్ధుకు నెరేట్ చేశారని తెలుస్తోంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఆయన ఇమేజ్ కు ఆ కథ సరిపోతుందని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో నిజమెంతో తెలియకపోయినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు మాత్రం వస్తున్నాయి.
అదే సమయంలో సిద్ధు- అనిల్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే యువ హీరోలతో పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. సిద్ధుతో కూడా సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులు రూపొందించింది. అందుకే ఆ కాంబినేషన్ పై కూడా ఆసక్తి పెరుగుతోంది.
ఏదేమైనా సిద్ధుతో అనిల్ చేయనున్న మూవీ కథ నిజంగా అఖిల్ కోసం రాసిందా? అదే స్క్రిప్ట్ ఇప్పుడు సిద్ధు దగ్గరికి వెళ్లిందా? లేక కొత్త ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుందా? అనే విషయాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది. మొత్తానికి టాలీవుడ్ లో కథల ప్రయాణం ఎలా ఉంటుందో ఈ ఎగ్జాంపుల్ మరోసారి గుర్తు చేస్తోంది. ఒక హీరో కోసం ప్రారంభమైన ప్రాజెక్ట్, పరిస్థితులు మారడంతో మరో హీరో దగ్గరకు వెళ్లడం ఇండస్ట్రీలో సాధారణమే. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
