Begin typing your search above and press return to search.

రాజును మోసం చేసిన ప్రొడ్యూసర్ ఎవరు? అలా కూడా ఉన్నారా?

అయితే కొంతకాలం క్రితం ఓ ప్రొడ్యూసర్ చేతిలో మోసపోయారట. ఆయన టాలీవుడ్ కే చెందిన వారట. ఆ విషయాన్ని అఖిల్ రాజ్ స్వయంగా తెలిపారు.

By:  M Prashanth   |   3 Jan 2026 4:22 PM IST
రాజును మోసం చేసిన ప్రొడ్యూసర్ ఎవరు? అలా కూడా ఉన్నారా?
X

రాజు.. అదేనండీ రీసెంట్ గా రాజు వెడ్స్ రాంబాయి మూవీతో అందరినీ మెప్పించిన అఖిల్ రాజ్. సాధారణంగా ఆయన పేరు వినగానే గుర్తుకు రాకపోవచ్చు. కానీ రాజు వెడ్స్ రాంబాయిలోని రాజు పాత్ర అంటే మాత్రం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో తన నేచురల్ యాక్టింగ్ తో అందరినీ ఓ రేంజ్ లో మెప్పించారు.

ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న అఖిల్ రాజ్.. రాజు వెడ్స్ రాంబాయితో లైమ్ లైట్ లోకి వచ్చారు. మంచి విజయం అందుకున్నారు. రీసెంట్ గా ఈషా మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మరిన్ని సినిమాలకు సంబంధించిన ఆఫర్స్ అందుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే కొంతకాలం క్రితం ఓ ప్రొడ్యూసర్ చేతిలో మోసపోయారట. ఆయన టాలీవుడ్ కే చెందిన వారట. ఆ విషయాన్ని అఖిల్ రాజ్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఈషా మూవీ సక్సెస్ తో వచ్చిన జోష్ లో ఆయన.. ఆ సినిమా పోస్ట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు బిజీ బిజీగా గడుపుతున్నారు అఖిల్ రాజ్.

అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఒక ఫేక్ ప్రొడ్యూసర్ తనను మోసం చేశారని వెల్లడించారు. సదరు ప్రొడ్యూసర్ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారని, ఆ తర్వాత దాదాపు ఆరు నెలల సమయం వేస్ట్ చేశారని అఖిల్ తెలిపారు. కానీ తనకు రెండు- మూడు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు.

అయితేనేం సినిమా మాత్రం రూపొందించలేదని వెల్లడించారు. తనను ఆఫీస్ కు పిలిచేవారని, తీరా వెళ్లాక సినిమా కోసం తప్ప మిగతా విషయాలు మాట్లాడేవారని తెలిపారు. తరచూ అలాగే జరుగుతుండడం వల్ల.. ఏదో డౌట్ కొట్టిందని చెప్పారు. కానీ కొన్ని రోజులకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యాని యంగ్ హీరో చెప్పారు.

అదేంటంటే.. అలా చేయడం సదరు నిర్మాతకు ఒక ఫాంటసీ అంట అని తెలిపారు. ఎవరో ఒక హీరోనో లేదా హీరోయిన్ ను పిలిపిస్తారని, ఆ తర్వాత అడ్వాన్స్ ఇచ్చి ఫిక్స్ చేసుకుంటారని తెలిసిందని అన్నారు. కానీ సినిమా చేయరని తెలిసిందని, అసలు ఆయనకు అదేం సరదానో.. ఇప్పటి వరకు తనకు అర్థం కాలేదని చెప్పారు.

ప్రస్తుతం అఖిల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. రాజును మోసం చేసిన ప్రొడ్యూసర్ ఎవరోనని మాట్లాడుకుంటున్నారు. అదేం సరదోనని, అలా కూడా ఉంటారని డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఫేక్ ప్రొడ్యూసర్ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.