Begin typing your search above and press return to search.

ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అక్కినేని కోడ‌లు బ‌ర్త్‌డే వేడుక‌లు

అఖిల్, జైనాబ్ గత సంవత్సరం నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అంత‌కు ముందు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్ లో ఉన్నారు. అటుపై పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

By:  Sivaji Kontham   |   10 Sept 2025 9:28 AM IST
ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అక్కినేని కోడ‌లు బ‌ర్త్‌డే వేడుక‌లు
X

కోడ‌లు జైనాబ్ రావూజీ మొద‌టి బ‌ర్త్ డే వేడుక‌లను అక్కినేని కుటుంబం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించింది. ఈ ఏడాది జూన్ 6న అఖిల్ అక్కినేని- జైనాబ్ రావూజీ జంట‌ పెళ్లి చేసుకున్నారు. జైన‌బ్ పెళ్లి తర్వాత సెప్టెంబ‌ర్ 9న‌ తన మొదటి పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో అక్కినేని ఫ్యామిలీ ఈ బ‌ర్త్ డేని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా సెల‌బ్రేట్ చేయ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.

ముగ్గురు హీరోల సంద‌డి:

ఇంత‌కుముందే సోష‌ల్ మీడియాలో త‌న భార్య జైనాబ్ తో క‌లిసి ఉన్న రొమాంటిక్ ఫోటోని అఖిల్ షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. `హ్యాపీ బర్త్‌డే మై లైఫ్` అనే క్యాప్షన్ తో అఖిల్ ఈ ఫోటోని షేర్ చేసారు. ఇప్పుడు బ‌ర్త్ డే వేడుక‌ల వెన్యూ వ‌ద్ద అక్కినేని నాగార్జున స‌హా బ్ర‌ద‌ర్స్ నాగ‌చైత‌న్య‌- అఖిల్ క‌నిపించిన వీడియో వైర‌ల్ గా మారింది. జైన‌బ్ బ‌ర్త్ డే వేడుక‌ల ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయో ఆ ముగ్గురూ ముంద‌స్తుగా ప‌ర్య‌వేక్షిస్తున్నప్ప‌టి దృశ్య‌మ‌ది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. నిన్న‌టిరోజున జైన‌బ్ బ‌ర్త్ డే వేడుక‌లు వైభ‌వంగా జ‌రిగాయి.

రెండేళ్ల పాటు డేటింగ్:

అఖిల్, జైనాబ్ గత సంవత్సరం నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అంత‌కు ముందు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్ లో ఉన్నారు. అటుపై పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అఖిల్ ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోగా కెరీర్ ని న‌డిపిస్తున్నారు. అత‌డు ఇంకా పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించ‌లేదు. అఖిల్ (2015), హలో! (2017), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్, ఏజెంట్ (2023) వంటి చిత్రాలలో న‌టించాడు.

జైనాబ్ నేప‌థ్యం:

అఖిల్ అక్కినేని భార్య జైనాబ్ రావ్ జీ ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్. సంప‌న్న కుటుంబానికి చెందిన యువ‌తి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. జైనాబ్ రావ్‌జీ మూడు దేశాల్లో త‌న ప్ర‌తిభ‌తో మెరుస్తున్నారు. భారతదేశం, దుబాయ్, లండన్‌లో తనదైన ముద్ర వేస్తూ ఇన్ ఫ్లూయెన్స‌ర్ గా, న‌టిగా పేరు ఘ‌డించారు. రెండేళ్ల క్రితం అఖిల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింద‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్ జీకి నాగార్జునకు చిరకాల స్నేహితుడు. జుల్ఫీ గ‌త తెలంగాణ ప్ర‌భుత్వాల్లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించార‌ని, దేశ విదేశాల్లో వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నార‌ని చ‌ర్చ ఉంది.