Begin typing your search above and press return to search.

ఇంట్లో బాస్ ఎవరో చెప్పేసిన అఖిల్

ఈ ప్రమోష‌న్స్ లో భాగంగా ఆయన పాల్గొంటున్న ఇంటర్వ్యూలు సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా, అత‌ని ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నాయి

By:  Sravani Lakshmi Srungarapu   |   10 July 2026 11:15 AM IST
ఇంట్లో బాస్ ఎవరో చెప్పేసిన అఖిల్
X

అఖిల్ అక్కినేని ప్రస్తుతం లెనిన్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోష‌న్స్ లో భాగంగా ఆయన పాల్గొంటున్న ఇంటర్వ్యూలు సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా, అత‌ని ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఫ‌న్నీ ఇంటర్వ్యూలో అఖిల్ తన మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్వ్యూలో భాగంగా గెటప్ శ్రీను కూరగాయల వ్యాపారిగా నటిస్తూ అఖిల్‌కు బేరం చేసే టాస్క్ ఇచ్చాడు. అయితే ఆ పరిస్థితిని కూడా అఖిల్ తనదైన కామెడీతో హ్యాండిల్ చేశాడు. తాను బేరసారాలు చేయడంలో అసలు నిపుణుడిని కాద‌ని, అలాంటి విషయాల్లో త‌న‌క‌స‌లు అనుభవం లేదని నవ్వుతూ చెప్పాడు. అంతేకాదు, ఇంట్లో ఫైనాన్షియ‌ల్ విషయాలు, షాపింగ్ కు సంబంధించిన డెసిష‌న్స్‌లో భార్య జైనబ్ ఎక్కువ చురుకుగా వ్యవహరిస్తుందని వెల్లడించాడు.

అఖిల్ చెప్పిన మాటల్లో భార్యపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి విషయంలో తానే ముందుండాలని కాకుండా, ఏ విషయంలో ఎవరికైతే అవగాహన ఎక్కువగా ఉంటుందో వారికి బాధ్యతలు అప్పగించడం మంచి దాంపత్యానికి సంకేతమని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ త‌న భార్య నిర్ణయాలను గౌరవిస్తూ మాట్లాడిన తీరు కూడా చాలామందిని ఆకట్టుకుంటోంది.

మరోవైపు, తనకు రాని విషయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా అంద‌రి ముందు ఒప్పుకోవడం కూడా అఖిల్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశంగా కనిపిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ ప‌ర్స‌న్‌ల లైఫ్ కు సంబంధించిన విషయాలను చాలా లిమిటెడ్ గానే షేర్ చేసుకుంటారు. కానీ అఖిల్ మాత్రం ఎంతో సహజంగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా తన మ్యారీడ్ లైఫ్‌లోని చిన్న సంఘటనను ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవ‌డం విశేషంగా మారింది.

గతేడాది జూన్‌లో తన ప్రేయ‌సి జైనబ్ రవ్దీజీని అఖిల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా హడావుడికి దూరంగానే ఉంచుతున్నారు. అలాంటి సమయంలో అఖిల్ చేసిన ఈ సరదా కామెంట్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా జైనబ్ గురించి ఆయన ఎంతో గౌరవంగా, అభిమానంతో మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో ప్రశంసలందుకుంటోంది. ఇక లెనిన్ ప్రమోషన్స్‌లో సినిమా విశేషాలతో పాటు ఇలాంటి ప‌ర్స‌న‌ల్ విష‌య‌లు కూడా హైలైట్ అవుతుండటంతో ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమాపై ఆసక్తిని పెంచడంతో పాటు, అఖిల్‌లోని సరదా మనస్తత్వం, నిజాయితీ, ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ను ఈ ఇంటర్వ్యూ మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసింది.