అఖిల్.. ఎన్టీఆర్ ఇంట్లో ఆ సీక్రెట్ మీటింగ్ కథ ఇదేనా?
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త బలంగా వినిపిస్తోంది. అఖిల్ ఒక టాప్ డైరెక్టర్ తో టచ్ లో ఉన్నారని, వీరిద్దరూ ఒక చోట కలుసుకున్నారని టాక్ నడిచింది.
By: M Prashanth | 8 Dec 2025 12:12 PM ISTఅక్కినేని అఖిల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 'ఏజెంట్' ఫలితం ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని, ఇప్పుడు తన తదుపరి సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం 'లెనిన్' అనే సినిమాతో బిజీగా ఉన్న అఖిల్, ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఒక సినిమా రిలీజ్ అయ్యాకే మరో సినిమా కబురు వినిపిస్తుంది. కానీ ఈసారి అఖిల్ సైలెంట్ గా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నారట.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త బలంగా వినిపిస్తోంది. అఖిల్ ఒక టాప్ డైరెక్టర్ తో టచ్ లో ఉన్నారని, వీరిద్దరూ ఒక చోట కలుసుకున్నారని టాక్ నడిచింది. అది ఎక్కడో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నివాసంలో. తారక్ ఇంట్లో జరిగిన ఒక ప్రైవేట్ గ్యాదరింగ్ లో అఖిల్ సందడి చేశారు. అయితే అక్కడ ఆయనతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది.
అసలు విషయం ఏంటంటే.. అఖిల్ తదుపరి సినిమాకు ప్రశాంత్ నీల్ బ్యాకప్ ఉండబోతోందట. అయితే డైరెక్షన్ చేసేది నీల్ కాదు. ప్రశాంత్ నీల్ దగ్గర పని చేసిన ఒక అసోసియేట్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన మీటింగ్ లోనే దీనికి సంబంధించిన చర్చలు వచ్చాయని, నీల్ తన శిష్యుడిని అఖిల్ కు రికమండ్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఫుల్ మాస్, హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆయన దగ్గర పని చేసిన అసిస్టెంట్స్ కూడా అదే స్కూల్ నుంచి వచ్చిన వారు కాబట్టి, కచ్చితంగా ఆ మార్క్ కనిపిస్తుంది. అఖిల్ ఎప్పటి నుంచో ఒక సాలిడ్ మాస్ హిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నీల్ శిష్యుడితో జతకడితే, ఆ మాస్ కోరిక తీరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నీల్ కాంపౌండ్ నుంచి వచ్చే కథ అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. పైగా నీల్ పర్యవేక్షణ కూడా ఉంటే అవుట్ పుట్ వేరే లెవెల్ లో ఉంటుంది. అఖిల్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే పక్కా యాక్షన్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. 'లెనిన్' తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఇదేనని టాక్. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సాక్షిగా ఈ ప్రాజెక్ట్ కు బీజం పడిందంటే, కచ్చితంగా ఇది అక్కినేని ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇచ్చే న్యూసే. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
