అదే జరిగితే.. 'లెనిన్' కమ్ బ్యాక్ మూవీనే కాకుండా..
అక్కినేని అఖిల్ లీడ్ రోల్ లో నటించిన లెనిన్ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ టాలీవుడ్ లో ఆ సినిమాపై ఆసక్తి నెలకొంది.
By: M Prashanth | 9 July 2026 1:36 PM ISTఅక్కినేని అఖిల్ లీడ్ రోల్ లో నటించిన లెనిన్ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ టాలీవుడ్ లో ఆ సినిమాపై ఆసక్తి నెలకొంది. వరుస ఫ్లాపుల తర్వాత అఖిల్ కు ఇది కీలకమైన సినిమా కావడంతో ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా రిజల్ట్ పై ఫోకస్ పెట్టారు. మంచి టాక్ వస్తే ఆ చిత్రం కేవలం కమ్ బ్యాక్ మూవీగా మాత్రమే కాకుండా అఖిల్ కెరీర్ లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఆ రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అఖిల్ కంప్లీట్ మాస్ అవతార్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ లో అంచనాలను పెంచాయి. ముఖ్యంగా గత చిత్రాలతో పోలిస్తే అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ఎలివేషన్స్ కొత్తగా ఉండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.24 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.25 కోట్ల షేర్ వసూళ్లు రావాల్సి ఉంటుంది. గ్రాస్ పరంగా చూస్తే దాదాపు రూ.50 కోట్ల మార్క్ ను అందుకుంటే సినిమా కమర్షియల్ గా స్ట్రాంగ్ విజయాన్ని నమోదు చేసినట్లేనని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అయితే ఆ టార్గెట్ చేరుకోవడం ప్రేక్షకుల రెస్పాన్స్ పైనే ఆధారపడి ఉంటుందని ట్రేడ్ ఎక్స్ప్రర్ట్స్ చెబుతున్నారు.
మొదటి రోజు నుంచే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే వీకెండ్ లో భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం సినిమాపై ఉన్న బజ్‌ను బట్టి తొలి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద కీలకంగా మారనున్నాయి. అఖిల్ కెరీర్ చూస్తే ఇప్పటివరకు ఆయన నటించిన చిత్రాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే బయ్యర్లకు లాభాలు అందించిన కమర్షియల్ హిట్ గా నిలిచింది. చివరగా వచ్చిన ఏజెంట్ నిరాశ కలిగించడంతో అఖిల్ మరో విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
అందుకే ఇప్పుడు లెనిన్ రిజల్ట్ ఆయన కెరీర్ కు కీలక మలుపుగా భావిస్తున్నారు. మరోవైపు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే నిర్మాతలకు కొంత భరోసా లభించినప్పటికీ, అసలు పరీక్ష మాత్రం థియేటర్లలోనే ఉండనుంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించగలిగితే బాక్సాఫీస్ వద్ద సినిమా ఆశించిన స్థాయిలో నిలబడే అవకాశాలు ఉన్నాయి.
దీంతో ఇప్పుడు లెనిన్ మంచి విజయం సాధిస్తే అది అఖిల్ కు సాధారణ హిట్ మాత్రమే కాదు. వరుస పరాజయాల తర్వాత స్ట్రాంగ్ కమ్ బ్యాక్ గా నిలవడమే కాకుండా, ఆయన మార్కెట్ ను మళ్లీ స్ట్రాంగ్ గా మార్చే చిత్రంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. ప్రేక్షకుల నుంచి వచ్చే టాక్ ఎలా ఉంటుంది? అదే లెనిన్ బాక్సాఫీస్ జర్నీని, అఖిల్ కెరీర్ లో కొత్త ఛాప్టర్ ను డిసైడ్ చేయనుంది.
