కలక్షన్స్ వర్సెస్ అఖిల్.. గెలుస్తాడా?
ఇప్పుడు అఖిల్ ముందు కూడా ఇదే పెద్ద టాస్క్ లా కనిపిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ అతని గత చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి.
By: M Prashanth | 11 July 2026 10:24 AM ISTఒక సినిమా థియేటర్లలోకి వచ్చిందంటే చాలు, అందరి ఫోకస్ బాక్సాఫీస్ నెంబర్ల మీదే ఉంటుంది. వసూళ్ల లెక్కలను బట్టే సినిమా సక్సెస్ ని కొలిచే ధోరణి ఇండస్ట్రీలో ఎక్కువైపోయింది. అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ 'లెనిన్' విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ లో రొమాంటిక్ లవ్ స్టోరీలతో పాటు అప్పుడప్పుడు యాక్షన్ జోనర్స్ ట్రై చేసిన అఖిల్, ఈసారి కంప్లీట్ గా రూట్ మార్చి ఒక భిన్నమైన రగ్గడ్ డ్రామాతో ముందుకు వచ్చాడు.
ఈ సినిమాలో నటుడిగా అఖిల్ కొత్తగా ప్రయత్నం చేశాడు అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో జస్ట్ నటుడిగా ప్రశంసలు అందుకుంటే సరిపోదు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వస్తేనే హీరోకి అసలైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కమర్షియల్ సక్సెస్ అనేది ఏ హీరోకైనా మార్కెట్ ని నిలబెట్టేదే. కానీ కొన్ని సినిమాల విషయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోయినా, నటుడిగా మాత్రం సదరు హీరో గట్టిగా హైలైట్ అవుతుంటారు. ఆ పాత్రలో చూపించిన ఇంటెన్సిటీ వారి కెరీర్ లో లాంగ్ రన్ కి హెల్ప్ అవుతుంది.
ఇప్పుడు అఖిల్ ముందు కూడా ఇదే పెద్ద టాస్క్ లా కనిపిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ అతని గత చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ కి తగ్గట్టుగా ఒక లోకల్ కుర్రాడిలా ఒదిగిపోయే ప్రయత్నం స్క్రీన్ మీద కనిపించింది. గ్లామర్, క్లాస్ ఇమేజ్ కి దూరంగా జరిగి కేవలం క్యారెక్టర్ లోని ఎమోషన్స్ ని క్యారీ చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని కీలకమైన మలుపులు, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లో అఖిల్ చూపించిన ఇంటెన్సిటీ చూశాక, రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ క్లాష్ లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా కలెక్షన్ల రేంజ్ ఏంటనేది ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి తేలిపోతుంది. అయితే వసూళ్ల లెక్కలు ఎలా ఉన్నా, ఒక యాక్టర్ గా అఖిల్ లోని సరికొత్త యాంగిల్ ని ఈ సినిమా బయటకు తీసిందనే చర్చ మాత్రం నడుస్తోంది. లవ్ స్టోరీల హీరో అనే ఇమేజ్ నుంచి బయటకు వచ్చి ఇలాంటి రూటెడ్ డ్రామా చేయడం వల్ల, నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్లకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నటన పరంగా ఛాలెంజ్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలను కూడా అఖిల్ క్యారీ చేయగలడు అనే నమ్మకాన్ని కొత్త మేకర్స్ లో ఈ సినిమా ఎంతవరకు కలిగిస్తుందో చూడాలి.
ఒక వైపు తన మార్కెట్ కి సరిపోయే సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలాంటి రూటెడ్ కథలను ఎంచుకోవడం వల్ల హీరోల నటనలో పరిణతి పెరుగుతుంది. మారిన నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం టాలీవుడ్ యంగ్ స్టార్స్ లో కనిపిస్తున్న ఒక చేంజ్. ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ఎలా ఉన్నా, అఖిల్ నటనలో మునుపటి కంటే మెరుగైన ఈజ్ కనిపించిందనేది ట్రేడ్ టాక్. అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్లే సగటు సినిమా ప్రేమికుడికి ఈ పల్లెటూరి డ్రామా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. ఇక బాక్సాఫీస్ లెక్కలలో అఖిల్ ఎంతవరకు నెట్టుకొస్తాడో చూడాలి.
