నేను అఖిల్ మాట్లాడుతున్నా.. అయితే నేను నాగార్జునను.. అభిమాని రిటార్ట్!
ఫోన్ ఎత్తిన అవతలి వ్యక్తితో హీరో అఖిల్ మాట్లాడుతూ.. ``హలో.. నేను అక్కినేని అఖిల్ మాట్లాడుతున్నా`` అని ఎంతో మర్యాదగా పరిచయం చేసుకున్నారు.
By: Sivaji Kontham | 9 July 2026 11:57 PM ISTఅక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం `లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా రేపు (శుక్రవారం) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డే కి వారం ముందు చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ముఖ్యంగా హీరో అఖిల్ తన సినిమాకు ఎలాంటి లోటు రాకుండా వినూత్నంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల విడుదల చేసిన కొన్ని డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్స్ ప్రేక్షకులలో సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా అఖిల్ ... ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను కలిసి చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి లెనిన్ సినిమా పబ్లిసిటీ కోసం ఒక క్రేజీ చిట్ చాట్ సెషన్‌ను ప్లాన్ చేశారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిన ఈ ఇంటర్వ్యూలో అఖిల్ ఎంతో యాక్టివ్‌గా పాల్గొని సినిమా విశేషాలను షేర్ చేస్తూ.. గెటప్ శ్రీనుతో కలిసి చేసిన హంగామా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
అయితే ఈ చిట్ చాట్ మధ్యలో అఖిల్ - గెటప్ శ్రీను కలిసి ఒక అజ్ఞాత వ్యక్తికి ఫన్నీగా ప్రాంక్ కాల్ చేశారు. ఫోన్ ఎత్తిన అవతలి వ్యక్తితో హీరో అఖిల్ మాట్లాడుతూ.. ``హలో.. నేను అక్కినేని అఖిల్ మాట్లాడుతున్నా`` అని ఎంతో మర్యాదగా పరిచయం చేసుకున్నారు. కానీ అవతలి వ్యక్తి అది నిజం అఖిల్ అని నమ్మకుండా ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ లేదా ఫ్రెండ్స్ తనతో ఆటపట్టిస్తున్నారని అనుకున్నాడు.
దాంతో ఆ అవతలి వ్యక్తి ఏమాత్రం తడుముకోకుండా నవ్వుతూ..``హహహ.. నువ్వు అఖిల్ మాట్లాడుతుంటే.. నేను ఇక్కడ నాగార్జునను మాట్లాడుతున్నా!`` అంటూ ఫన్నీగా రిటార్ట్ ఇచ్చాడు. ఆ సమాధానం వినగానే అటు అఖిల్, ఇటు గెటప్ శ్రీను ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయి నవ్వు ఆపుకోలేకపోయారు. వీరిద్దరి మధ్య సాగిన ఈ ఫన్నీ సంభాషణలతో ప్రాంక్ కాల్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
ఈ క్రేజీ ప్రమోషన్లతో `లెనిన్` సినిమాకు ఇండస్ట్రీలో - ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఒక వైపు వైవిధ్యమైన కథాంశం.. మరోవైపు అఖిల్ అక్కినేని సపోర్ట్, గెటప్ శీను కామెడీ టైమింగ్ అన్నీ కలిసి ఈనెల 19న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారాయి. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న `లెనిన్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
