తాత విగ్రహం ముందు తండ్రి కాళ్లపై పడి అఖిల్ కన్నీళ్లు.. అసలేం జరిగిందంటే?
ఈ నేపథ్యంలోనే తన తాత దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు కేక్ కట్ చేయగా.. అఖిల్ మొదట తన తండ్రి కాళ్ల పై పడి, అనంతరం తన తండ్రిని హగ్ చేసుకుని బోరున ఏడ్చేసాడు.
By: Madhu Reddy | 10 July 2026 7:43 PM ISTప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అఖిల్ పేరే గట్టిగా వినిపిస్తోంది. దీనికి కారణం దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి సక్సెస్ అందుకున్నారనే కారణం.. నిజానికి గత మూడేళ్ల క్రితం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అఖిల్. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పైగా అటు అఖిల్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నప్పటికీ.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బోల్తా పడ్డారు అఖిల్. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత మళ్లీ ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అందరూ అనుకున్నారు. అయితే సడన్గా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత లెనిన్ సినిమా ప్రకటించారు. మరి ఈ మూడేళ్లు ఏమైపోయారు? ఎందుకు మరో కథను ఆయన ప్రకటించలేదు? కథను ఎంచుకోవడానికి మూడేళ్ల సమయం పట్టిందా ?ఇలా పలు రకాల కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అయ్యాయి.
అయితే ఎట్టకేలకు అఖిల్ లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పైగా ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అభిమానులు తనపై కోపంగా ఉన్నారని, తాను మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం వెనుక అసలు కారణాన్ని చెప్పారు ..తాను మంచి కథలతో ప్రేక్షకుల ముందుకి రావాలనుకున్న సమయంలో సడన్గా కాలుజారి బాత్రూంలో పడ్డాను ..రెండు శస్త్ర చికిత్సలు కూడా జరిగాయని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని ప్రేక్షకుల ముందుకు వచ్చారు అఖిల్. తన అద్భుతమైన మాస్ పర్ఫామెన్స్ తో తనలోని నటుడిని బయటకు తీసి లెనిన్ సినిమాతో అలరించారు. ఇక ప్రస్తుతం లెనిన్ స్టోరీ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ అఖిల్ పర్ఫామెన్స్ కి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది.
మరోవైపు చిత్ర బృందం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే తన తాత దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు కేక్ కట్ చేయగా.. అఖిల్ మొదట తన తండ్రి కాళ్ల పై పడి, అనంతరం తన తండ్రిని హగ్ చేసుకుని బోరున ఏడ్చేసాడు. అఖిల్ కళ్ళల్లో నీళ్లను చూసి నాగార్జున కూడా ఎమోషనల్ అవ్వడం గమనార్హం . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా సక్సెస్ ఇచ్చిన ఆనందం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అఖిల్ లెనిన్ విషయానికి వస్తే.. అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన చిత్రం లెనిన్. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ , నాగార్జున ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
