Begin typing your search above and press return to search.

బాలయ్యకు పోటీగానే ఆది!

అయితే డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ అయ్యేందుకు ఇప్పటికే పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆయా సినిమాల మేకర్స్.. అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్రమోషన్స్ కూడా చేపడుతున్నారు.

By:  M Prashanth   |   6 Dec 2025 2:59 PM IST
బాలయ్యకు పోటీగానే ఆది!
X

సీనియర్ హీరో బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2: తాండవం మూవీ కొత్త రిలీజ్ డేట్ కోసం అంతా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా మూవీని రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

త్వరలోనే ఆ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రమోషన్స్ కూడా చేపట్టనున్నారని తెలుస్తోంది. అయితే డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ అయ్యేందుకు ఇప్పటికే పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆయా సినిమాల మేకర్స్.. అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్రమోషన్స్ కూడా చేపడుతున్నారు.

అందులో ఒకటి శంబాల.. టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ మూవీ వైవిధ్యమైన కథతో రూపొందుతోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌ రాబోతున్న ఆ సినిమాను ఏ యాడ్‌ ఇన్‌ఫినిటీ ఫేం యుగంధర్‌ మునిస దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో ఆది ఒక జియో సైంటిస్ట్‌ గా కనిపించనున్నారని టాక్.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న శంబాలను డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. అదే సమయంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది. మూవీ అలరిస్తుందని అంచనాలు ఉన్నాయి.

ఆది కూడా హిట్ కొడతాననే నమ్మకంతోనే ఉన్నారు. అయితే ఇప్పుడు అఖండ-2కు పోటీగా రంగంలోకి దిగేందుకు కూడా సిద్ధం అంటున్నారు! రీసెంట్ గా అఖండ 2 కోసం శంబాలా వాయిదా వేస్తారా అని ఒక అభిమాని ఆదిని అడిగ్గా.. ఆయన స్పందించారు. పోటీ ఉన్నా కూడా శంబాల విషయంలో తగ్గమని క్లారిటీ ఇచ్చారు.

ఎందుకంటే తాము ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో భారీగా ఇన్వెస్ట్ చేశామని, ఇలాంటి స్టేజ్ లో వెనక్కి తగ్గడం కష్టమని తెలిపారు. స్క్రీన్స్ అనుకున్నట్లు లభిస్తాయని చెప్పలేమని, కానీ తమకు వేరే దారి లేదని చెప్పారు. పోస్ట్ పోన్ చేయడానికి మరో డేట్ కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. అందుకే వాయిదా వేయలేమని స్పష్టం చేశారు. దీంతో బాలయ్యకు పోటీగానే ఆది రానున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.