Begin typing your search above and press return to search.

అంద‌రి క‌ళ్లూ అఖండ2 ట్రైల‌ర్ పైనే!

వ‌రుస స‌క్సెస్‌ల‌తో ఫుల్ జోష్ మీదున్న గాడ్ ఆఫ్ మాసెస్ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అఖండ2 తాండ‌వం సినిమాతో బిజీగా ఉన్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 Nov 2025 7:26 PM IST
అంద‌రి క‌ళ్లూ అఖండ2 ట్రైల‌ర్ పైనే!
X

వ‌రుస స‌క్సెస్‌ల‌తో ఫుల్ జోష్ మీదున్న గాడ్ ఆఫ్ మాసెస్ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అఖండ2 తాండ‌వం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే షూటింగ్ ను పూర్తి చేసి ఆ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు బాల‌య్య‌. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అఖండ‌2 మూవీ డిసెంబ‌ర్ 5వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.




పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, సూప‌ర్ హిట్ మూవీ అఖండ‌కు సీక్వెల్ గా ఈ మూవీ రూపొందింది. పైగా బాల‌య్య- బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌స్తున్న అవ‌డంతో ఈ ప్రాజెక్టుపై ముందు నుంచి అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. దానికి తోడు ఇప్ప‌టివ‌ర‌కు అఖండ‌2 నుంచి వ‌చ్చిన ప్ర‌తీ కంటెంట్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతుంది.

టీజ‌ర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్

ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్, రెండు సాంగ్స్ రిలీజ‌వ‌గా, టీజ‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, రీసెంట్ గా రిలీజైన రెండు సాంగ్స్ చార్ట్‌బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ముంబైలో రిలీజైన ఫ‌స్ట్ సింగిల్ తాండ‌వం మంచి భ‌క్తితో పాటూ శివుని ట్రాన్స్ తో క్లాసీగా ఉండ‌గా, వైజాగ్ లో రిలీజైన సెకండ్ సాంగ్ జాజికాయ, బాల‌య్య ట్రెండీ స్టెప్స్ తో మాస్ గా ఉంది.

ఇదిలా ఉంటే న‌వంబ‌ర్ 21న అఖండ‌2 నుంచి ట్రైల‌ర్ రాబోతుంది. సోష‌ల్ మీడియాలో ఈ సినిమా గురించి, ట్రైల‌ర్ గురించి భారీ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. సినిమాపై రోజురోజుకీ బ‌జ్ పెరుగుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ట్రైల‌ర్ ను రిలీజ్ చేస్తున్నారు. న‌వంబ‌ర్ 21వ తేదీన బెంగుళూరు లో జ‌రిగే ఓ ప‌బ్లిక్ ఈవెంట్ లో అఖండ‌2 ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్. ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్ కుమార్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టు గా రానున్నారు. అఖండ‌2 ను 2డీ, 3డీ లో రిలీజ్ కానుండ‌గా, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.