Begin typing your search above and press return to search.

అఖండ 2: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  M Prashanth   |   2 Dec 2025 10:29 PM IST
అఖండ 2: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'అఖండ' బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక భారీ గుడ్ న్యూస్ అందింది. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.




ఈ ఉత్తర్వుల ప్రకారం, సినిమా విడుదలైన మొదటి పది రోజుల పాటు (డిసెంబర్ 5 నుంచి) టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 75, మల్టీప్లెక్స్ లలో రూ. 100 వరకు అదనంగా పెంచుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. ఇది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఊరట కలిగించే అంశం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో, ఈ పెంపు వల్ల రికవరీకి మంచి అవకాశం ఉంటుంది.

అలాగే బెనిఫిట్ షోల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఒక స్పెషల్ షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించింది. అంటే రిలీజ్ కు ముందే అర్ధరాత్రి నుంచే 'జై బాలయ్య' నినాదాలు థియేటర్లలో మార్మోగడం ఖాయం. రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే అవకాశం కూడా ఇచ్చారు.

సాధారణంగా పెద్ద సినిమాలకు ప్రభుత్వం నుంచి ఇలాంటి సపోర్ట్ లభిస్తే, ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు బద్దలవుతుంటాయి. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా అదే అడ్వాంటేజ్ దొరికింది. తెలంగాణలో కూడా త్వరలోనే ఇలాంటి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

బోయపాటి శ్రీను టేకింగ్, బాలయ్య విశ్వరూపం, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్. ఆధ్యాత్మికత, యాక్షన్ మిక్స్ తో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియెన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రభుత్వం ఇచ్చిన ఈ బూస్ట్ ను ఉపయోగించుకుని 'అఖండ 2' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మొత్తానికి అన్ని అడ్డంకులు తొలగిపోయి, ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. ఇక థియేటర్లలో 'అఖండ' నామస్మరణ మొదలవ్వడమే తరువాయి. సంక్రాంతికి ముందే బాలయ్య బాక్సాఫీస్ బొమ్మ చూపిస్తారని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా మొదటిరోజు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.