Begin typing your search above and press return to search.

అఖండ 2 సస్పెన్స్.. అన్ని అనుకున్నట్లు జరిగితే..

'అఖండ 2' సినిమా విడుదల ఆగిపోవడంతో నందమూరి అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

By:  M Prashanth   |   5 Dec 2025 10:04 AM IST
అఖండ 2 సస్పెన్స్.. అన్ని అనుకున్నట్లు జరిగితే..
X

'అఖండ 2' సినిమా విడుదల ఆగిపోవడంతో నందమూరి అభిమానులు నిరాశలో మునిగిపోయారు. రిలీజ్ వాయిదా పడిందని మేకర్స్ ప్రకటించిన తర్వాత, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. కొందరు డిసెంబర్ 18 అని మరికొందరు సంక్రాంతి అని అంటున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడొక ఒక ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. సినిమాకు సంబంధించిన ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయని, విడుదలకు లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే.

బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం.. సినిమా ఆగిపోవడానికి కారణమైన ఆర్థిక లావాదేవీలను నిర్మాతలు పరిష్కరించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించడానికి లేదా ఒక అంగీకారానికి రావడానికి చర్చలు జరిపారని, ఆ సమస్య కొలిక్కి వచ్చిందని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి గానీ, సంబంధిత వ్యక్తుల నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎవరూ స్పందించలేదు.

ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం సినిమా విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లే. కానీ అసలు విషయం కోర్టు చేతిలో ఉంది. మద్రాస్ హైకోర్టు విధించిన 'స్టే' ఇంకా కొనసాగుతోంది. ఫిర్యాదుదారులు తమకు పేమెంట్ అందినట్లు కోర్టుకు తెలిపితేనే ఆ స్టే ఎత్తివేయబడుతుంది. ఆ తర్వాతే డిజిటల్ కీస్ రిలీజ్ అవుతాయి.

ప్రస్తుతం అందరి దృష్టీ కోర్టు ప్రొసీడింగ్స్ మీదే ఉంది. ఒకవేళ లోపల చర్చలు జరిగి, సమస్య పరిష్కారం అయి ఉంటే.. మధ్యాహ్నాని కల్లా కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే సాయంత్రం నుంచే ప్రీమియర్స్ లేదా షోలు మొదలయ్యే ఛాన్స్ లేకపోలేదు. అంటే 24 గంటల ఆలస్యంతో సినిమా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అధికారికంగా మేకర్స్ స్పందించే వరకు ఏదీ నమ్మలేని పరిస్థితి. నిరవధిక వాయిదా పడిందా లేక సాయంత్రానికే వస్తుందా అనే కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రూమర్స్ అభిమానులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నా, అసలు విషయం తేలేవరకు టెన్షన్ తప్పదు. మొత్తానికి 'అఖండ 2' చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా రిజల్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఎం జరుగుతుందో చూడాలి మరి.