కన్ప్యూజన్ లో సింహం అండ్ కో!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ2` ప్రతిష్టాత్మకంగా తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 4 Sept 2025 6:00 PM ISTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ2` ప్రతిష్టాత్మకంగా తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో బాలయ్య పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించడం ఖా యంగా వినిపిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వాస్త వానికి వాటన్నింటిని పూర్తి చేసి సెప్టెంబర్ 25కి చిత్రాన్ని వదలాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జా ప్యంగా కారణంగా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ తేదీ విషయంలో బాలయ్య , బోయ పాటి సహా టీమ్ అంతా గందర గోళనాకి గురవుతుంది.
కలిసొచ్చిన నెలలే రెండూ:
చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేయాలా? వచ్చే ఏడాది చేయాలా? అన్న మీమాంస కొనసాగుతోంది. ఇప్పటికే జనవరి 9న రిలీజ్ అంటూ ఓ తేదీ కూడా తెరపైకి వచ్చింది. జనవరి నెల పైగా సంక్రాంతి సీజన్ అంటే బాలయ్యకు బాగా కలిసొచ్చిన పండుగ కూడా. డిసెంబర్ కంటే జనవరి అయితే బాగుంటుందని కొంత మంది బలంగా నమ్ముతున్నారు. ఒకనెల తేడా కోసం డిసెంబర్ రిలీజ్ దేనికన్నది అన్న దానిపై చిత్ర వర్గాల్లో గట్టిగానే డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరోవైపు డిసెంబర్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.
కుంభమేళా తర్వాత సన్నివేశం మారింది:
బాలయ్యకు బాగా కలిసొచ్చిన నెల కూడా ఇదే. 'అఖండ' చిత్రం 2021 డిసెంబర్ 2న రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. పాన్ ఇండియాలో రిలీజ్ చేయలేదుగానీ చేస్తే ఆ సినిమాతోనే బాలయ్య పాన్ ఇండియా స్టార్ అయ్యేవారు. ఆ ప్రభావం ఎలా ఉండేది? అన్నది కుంభమేళాలో ప్రూవ్ అయింది. అఖండ పేరిట ప్లెక్సీలు కుంభమేళా నార్త్ ట్రావెల్స్ పై ప్రతక్షమవ్వడంతో అఖండకు ఆ రేంజ్ లో ఉందా? అన్న సంగతి తెలుగింట అర్దమైంది. ఆ సన్నివేశం తర్వాత `అఖండ2` పై అంచనాలు కూడా తారా స్థాయికి చేరాయి.
డిసెంబర్ వర్సెస్ జనవరి:
దర్జాగా పాన్ ఇండియాలో రిలీజ్ చేయోచ్చు అన్న ధీమా మేకర్స్ లో రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ గా డిసెంబర్ 2నే రిలీజ్ చేస్తే బాగుంటుందన్నది టీమ్ లో మరో సెక్షన్ గట్టిగా అభిప్రా యపడుతోంది. రిలీజ్ తేదీ విషయంలో ఇలా రెండు టీమ్ ల మద్య సీరియస్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి జనవరి రిలీజ్ నా? డిసెంబర్ రిలీజ్ నా? అన్నది తేలాల్సి ఉంది.
