Begin typing your search above and press return to search.

అఖండ-2.. రాత్రికి షో పడకపోతే?

ఒక రోజు ఆలస్యంగా అయినా సరే సినిమా రిలీజైతే అదే పదివేలు అనుకుంటున్నారు అభిమానులు.

By:  Garuda Media   |   5 Dec 2025 1:15 PM IST
అఖండ-2.. రాత్రికి షో పడకపోతే?
X

అఖండ-2.. ఈ ఏడాది తెలుగులో మోస్ట్ హైప్డ్ మూవీస్‌లో ఒకటి. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. ఈ రోజు సినిమా అధికారిక విడుదల కాగా.. ముందు రోజు రాత్రి సెకండ్ షో నుంచే పెయిడ్ ప్రిమియర్స్ వేయడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. కానీ అనూహ్యం.. నందమూరి అభిమానులు సంబరాలకు సిద్ధంగా ఉండగా ప్రిమియర్స్ క్యాన్సిల్ అంటూ బాంబు పేల్చారు. ఆ షాక్‌కే తట్టుకోలేకపోతుంటే.. మొత్తంగా సినిమానే వాయిదా పడుతున్నట్లు మేకర్స్ అర్ధరాత్రి ప్రకటించేసరికి నందమూరి అభిమానులకు నోట మాట రాలేదు.అసలేం జరుగుతోందనే ప్రశ్నలతో నిన్నట్నుంచి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఐతే ప్రిమియర్లు ఆగిపోవడం.. ఉదయం షోలూ రద్దవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న అభిమానులు.. తర్వాత కొంచెం తేరుకుని వాట్ నెక్స్ట్ అని చూస్తున్నారు.

ఒక రోజు ఆలస్యంగా అయినా సరే సినిమా రిలీజైతే అదే పదివేలు అనుకుంటున్నారు అభిమానులు. ఈరోస్ సంస్థతో 14 రీల్స్ వాళ్ల గొడవ సద్దుమణుగుతోందని.. ఒక అంగీకారానికి వస్తున్నారని.. ఇష్యూ సెటిలైనట్లే అని.. నిన్న రాత్రి పడాల్సిన పెయిడ్ ప్రిమియర్స్ ఈ రోజు పడతాయని.. రేపు సినిమా ఫుల్ లెంగ్త్ రిలీజ్ ఉంటుందని ఓవైపు వార్తలు వస్తున్నాయి.

కానీ ఇలా అభిమానులను ఆశల పల్లకిలో ఊరేగించి.. చివరికి షోలు పడకపోతే అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమనే ఉద్దేశంతో 14 రీల్స్ వాళ్లు మౌనం వహిస్తున్నారు. ఇష్యూ వందకు వంద శాతం సెటిలైతే తప్ప ఏ ప్రకటనా రాకపోవచ్చు. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి.. అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చాకే రిలీజ్ గురించి ఏ ప్రకటన అయినా చేస్తారని అంటున్నారు. ఒక వేళ ఈ రోజు రాత్రి తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమియర్స్ పడకపోయినా.. అర్ధరాత్రికి యుఎస్‌లో అయినా షో మొదలు కావాల్సిందే. అలా కాని పక్షంలో ‘అఖండ-2’ ఈ వీకెండ్లో విడుదల కానట్లే. ఈ సినిమా వచ్చే వారానికి వాయిదా పడితే.. అఖండ-2తో పాటు చాలా సినిమాలు దెబ్బ తింటాయి. షెడ్యూళ్లు అటు ఇటు అవుతాయి. చాలామందితో మాట్లాడుకుని సినిమాను రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది.