అన్నయ్య కోసం తమ్ముడు సైడ్ ఇవ్వడా..?
ఇక రాబోయే దసరాకి ఆల్రెడీ రెండు సినిమాలు రిలీజ్ లాక్ చేసుకున్నాయి. సెప్టెంబర్ 25న బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు వస్తున్నాయి.
By: Ramesh Boddu | 29 July 2025 2:00 AM ISTసెట్స్ మీద స్టార్ సినిమాల రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈమధ్య పాన్ ఇండియా రిలీజ్ అంటూ స్టార్ సినిమాలు చాలా వరకు అనుకున్న డేట్ కి రావట్లేదు. సినిమా రిలీజ్ అనౌన్స్ చేసినా సరే వచ్చే వరకు డౌట్ అనే పరిస్థితి ఏర్పడింది. అఫ్కోర్స్ కోట్ల కొద్దీ బడ్జెట్ తో చేస్తున్న సినిమాలు కాబట్టి అలా చుట్టేయడం కుదరదు. అందుకే సినిమా పూర్తై టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాతే రిలీజ్ చేస్తున్నారు.
అఖండ 2, OG..
ఇక రాబోయే దసరాకి ఆల్రెడీ రెండు సినిమాలు రిలీజ్ లాక్ చేసుకున్నాయి. సెప్టెంబర్ 25న బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. అఖండ 2 రిలీజ్ పై కాస్త డౌట్ ఉంది కానీ ఓజీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 25న వచ్చి తీరుతుందని మేకర్స్ చెబుతున్నారు.
ఐతే మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. అసలైతే సమ్మర్ కి తీసుకొద్దామనుకున్న సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అన్నయ్య చిరంజీవి సినిమా కూడా సెప్టెంబర్ లోనే తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉంది. అలా చేస్తే అన్నయ్య కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతాడా అంటే కష్టమే అన్నట్టు ఉంది.
మెగాస్టార్ విశ్వంభర కోసం
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2024 సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు. అది ఏడాది వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు విశ్వంభర కోసం ఓజీ వాయిదా అంటే ఛాన్స్ లేదని చెప్పేస్తారు. అందుకే విశ్వంభర సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో రిలీజ్ ఉండాలి. సెప్టెంబర్ 5న ఎలాగు అనుష్క, తేజా సజ్జ, రష్మిక సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేశారు.
సో ఎటొచ్చి సెప్టెంబర్ రెండో వారం విశ్వంభర రావాలి. ఒకవేళ అలా కాదంటే దివాళికి ఫిక్స్ చేసుకోవాలి. ఏది ఏమైనా విశ్వంభర సినిమా పూర్తై కూడా రిలీజ్ కాకుండా ఉండటం వల్ల సినిమాపై ఒకరకమైన నెగిటివిటీ ఏర్పడుతుంది. మరి విశ్వంభర సినిమా రిలీజ్ ఎప్పుడో చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే కానీ ఈ కన్ ఫ్యూజన్ కి తెరపడదు. దసరా రిలీజ్ సినిమాలు మరోసారి రిలీజ్ అనౌన్స్ చేస్తే విశ్వంభర రిలీజ్ డేట్ కూడా చిరంజీవి బర్త్ డే రోజు తెలిసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
