ఎన్నికల హడావిడిలో అఖండ 2.. ఇది పాన్ ఇండియా స్కెచ్చే..
టీవీలు ఆన్ చేసిన ప్రతీ ఒక్కరూ ఎన్డీఏ కూటమికి ఎన్ని?, మహాఘటబంధన్‌కు ఎన్ని? అంటూ జాతీయ న్యూస్ ఛానెళ్లకు అతుక్కుపోయారు. ఈ పొలిటికల్ హీట్ మధ్యలో, ప్రేక్షకులకు ఎవరూ ఊహించని ఒక మాస్ సర్‌ప్రైజ్ తగిలింది.
By: M Prashanth | 14 Nov 2025 12:40 PM ISTశుక్రవారం ఉదయం నుంచి దేశం మొత్తం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల టెన్షన్‌లో మునిగిపోయింది. టీవీలు ఆన్ చేసిన ప్రతీ ఒక్కరూ ఎన్డీఏ కూటమికి ఎన్ని?, మహాఘటబంధన్‌కు ఎన్ని? అంటూ జాతీయ న్యూస్ ఛానెళ్లకు అతుక్కుపోయారు. ఈ పొలిటికల్ హీట్ మధ్యలో, ప్రేక్షకులకు ఎవరూ ఊహించని ఒక మాస్ సర్‌ప్రైజ్ తగిలింది. రాజకీయ నాయకుల ఫోటోలు, నంబర్లతో నిండిన స్క్రీన్‌పై సడెన్‌గా బాలకృష్ణ ప్రత్యక్షమయ్యారు.
ఈ అనూహ్యమైన మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అసలు విషయం ఏమిటంటే, 'అఖండ 2: తాండవం' సినిమా ప్రమోషన్లను మేకర్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. కేవలం సినిమా ఛానెళ్లో, యూట్యూబ్‌లో కాకుండా, ఏకంగా దేశం మొత్తం అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజీలో తమ సినిమా బ్యానర్లను ప్రదర్శించారు.
ప్రముఖ హిందీ న్యూస్ ఛానెళ్లు బీహార్ ఎన్నికల ఫలితాలను లైవ్‌లో విశ్లేషిస్తుండగా, స్క్రీన్ కింద, పక్కన భారీ యాడ్స్‌లో 'అఖండ 2' పోస్టర్లు స్పష్టంగా కనిపించాయి. బాలకృష్ణ అఘోరా గెటప్, సినిమా టైటిల్ "డిసెంబర్ 5న థియేటర్లలో" అనే రిలీజ్ డేట్‌ను జాతీయ స్థాయిలో కోట్లాది మంది ప్రేక్షకులకు ఒకేసారి చేరవేశారు.
ఇది ఒక మామూలు ప్రమోషన్ కాదు, ఇది ఒక పక్కా 'పాన్ ఇండియా' మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎన్నికల ఫలితాల రోజున న్యూస్ ఛానెళ్ల టీఆర్‌పీ రేటింగ్స్ హై రేంజ్ లో ఉంటాయి. కొన్నిసార్లు ఇవి బిగ్ మ్యాచ్‌ల వ్యూయర్‌షిప్‌ను కూడా దాటేస్తాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన, హై విజిబిలిటీ స్లాట్‌లో ఒక తెలుగు సినిమా యాడ్స్ రన్ చేయడం అంటే, నిర్మాతలు హిందీ మార్కెట్‌పై ఎంత నమ్మకంగా ఉన్నారో, ఎంత భారీగా ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అంతే కాకుండా ముంబైలో నేడు ముంబైలో అఖండ 2 టైటిల్ సాంగ్ ను లాంచ్ చేయనున్నారు. బోయపాటి బాలయ్య ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. 'అఖండ 1' హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో, శాటిలైట్ ఛానెళ్లలో రికార్డులు సృష్టించింది. ఉత్తరాది ప్రేక్షకుల్లో బాలయ్య మాస్ యాక్షన్‌కు, బోయపాటి టేకింగ్‌కు ఇప్పటికే ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఆ క్రేజ్‌ను థియేటర్ల రూపంలో క్యాష్ చేసుకోవడానికి 'అఖండ 2' టీమ్ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసింది.
