Begin typing your search above and press return to search.

దీని కోసమా బాలయ్య ఇంత కష్టపడింది?

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దడానికి, రిలీజ్ చేయడానికి ఎంతో కష్టపడింది చిత్ర బృందం.

By:  Garuda Media   |   4 Dec 2025 3:15 PM IST
దీని కోసమా బాలయ్య ఇంత కష్టపడింది?
X

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దడానికి, రిలీజ్ చేయడానికి ఎంతో కష్టపడింది చిత్ర బృందం. దీన్ని ఒక ప్రాపర్ హిందీ మూవీలాగే తీర్చిదిద్దారు. స్వయంగా బాలయ్యే తన పాత్రలు రెంటికీ హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నారు. సినిమా ఓవరాల్ డబ్బింగ్ కూడా పక్కాగా చేశారు. ముంబయికి వెళ్లి ఒక పెద్ద ఈవెంట్ పెట్టి సినిమాను ప్రమోట్ చేశారు. బాలయ్య హిందీలో స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఐతే ఇంత కష్టపడితే.. ‘అఖండ-2’ హిందీ వెర్షన్‌కు నార్త్ ఇండియాలో కేటాయించిన కేటాయించిన, షోలు చూస్తే షాకవ్వక తప్పదు.

హిందీ సినిమాలకు కేంద్ర స్థానం అయిన ముంబయిలో ‘అఖండ-2’ హిందీ వెర్షన్‌కు కేవలం ఏడు షోలు మాత్రమే ఇవ్వడం గమనార్హం. రేప్పొద్దున సినిమా విడుదల కానుండగా.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉన్న షోల స్టేటస్ ఇది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేవలం నాలుగు షోలు కేటాయించారు ‘అఖండ-2’కు. కోల్‌కతా, లక్నో లాంటి పెద్ద నగరాల్లో కేవలం ఒక్కటంటే ఒక్క షో మాత్రమే ఇచ్చారు.

అహ్మదాబాద్, పుణె నగరాల్లో పరిస్థితి కొంచెం బెటర్. అహ్మదాబాద్‌లో 20 షోల దాకా కేటాయించారు ‘అఖండ-2’ హిందీ వెర్షన్‌కు. పుణెలో 13 షోల దాకా ఇచ్చారు. మొత్తంగా నార్త్ ఇండియా అంతటా లెక్కగడితే ‘అఖండ-2’ హిందీ వెర్షన్‌కు ఓ 50 షోలు ఇచ్చి ఉంటే గొప్ప అనుకోవచ్చు. దీంతో పోలిస్తే ఆయా నగరాల్లో ఇచ్చిన తెలుగు షోలు కూడా అదే స్థాయిలో ఉన్నట్లున్నాయి.

‘అఖండ’కు ఓటీటీలో హిందీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే కథాంశంతో ‘అఖండ-2’ను తీర్చిదిద్దారు. దీని ప్రోమోలు అక్కడి వారిని బాగానే ఆకట్టుకున్నట్లు కనిపించింది. కానీ చివరికి చూస్తే ఈ సినిమాకు ఉత్తరాదిన నామమాత్రంగా స్క్రీన్లు, షోలు ఇచ్చారు. రణ్వీర్ సింగ్ మూవీ ‘దురంధర్’ ఇదే రోజు రిలీజవుతుండడం ‘అఖండ-2’కు మైనస్ అయి ఉండొచ్చు. మరి రిలీజ్ తర్వాత టాక్‌ను బట్టి స్క్రీన్లు, షోలు పెంచుతారేమో చూడాలి.