Begin typing your search above and press return to search.

'అఖండ 2' అసలైన సాంగ్ వచ్చేసింది!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే మాస్ డైలాగులు, భారీ యాక్షన్ సీక్వెన్స్ లే గుర్తొస్తాయి. కానీ 'అఖండ' సిరీస్ లో మాత్రం డివైన్ టచ్ ప్రధానంగా ఉంటుంది.

By:  M Prashanth   |   1 Dec 2025 11:11 PM IST
అఖండ 2 అసలైన సాంగ్ వచ్చేసింది!
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే మాస్ డైలాగులు, భారీ యాక్షన్ సీక్వెన్స్ లే గుర్తొస్తాయి. కానీ 'అఖండ' సిరీస్ లో మాత్రం డివైన్ టచ్ ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు సీక్వెల్ నుంచి వచ్చిన ఓ పాట కూడా అదే దారిలో సాగింది. 'అఖండ 2: తాండవం' నుంచి 'హైందవం' అనే లిరికల్ వీడియో బయటకు వచ్చింది. ఫస్ట్ పార్ట్ లోని 'భం అఖండ' రేంజ్ లోనే ఇది కూడా కథలోని సోల్ ని పరిచయం చేసేలా ఉంది.




ఈ పాట పూర్తిగా ఆధ్యాత్మిక భావంతో ఉంది. పురాతన ఆలయ ప్రాంగణంలో అమ్మాయిలు పాడుతుంటే, బ్యాక్ గ్రౌండ్ లో అఖండ రూపంలో ఉన్న బాలకృష్ణ నడుచుకుంటూ రావడం వీడియోలో ప్రధానంగా కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ అనగానే హెవీ బీట్స్ ఉంటాయని ఆశించేవారికి ఇది కొంచెం కొత్తగా, క్లాసికల్ గా అనిపిస్తుంది. పూర్తిగా శాస్త్రీయ సంగీత ధోరణిలో, మెలోడియస్ గా ఈ పాటను కంపోజ్ చేశారు.

'సర్వేపల్లి సిస్టర్స్' ఈ పాటను ఆలపించారు. వారి గొంతులో ఉన్న స్పష్టత, సంప్రదాయ బద్ధమైన గానం పాటకు ప్రధాన బలం. నాగ గురునాథ శర్మ రాసిన సాహిత్యం సంస్కృత పదాలతో నిండి ఉండి, వినడానికి పవర్ ఫుల్ గా ఉంది. సనాతన ధర్మం, ప్రకృతి, శివుడి తత్వాన్ని వర్ణించేలా లిరిక్స్ ఉన్నాయి. విజువల్స్ లో బాలయ్య చాలా సీరియస్ గా, శివుడి ఆజ్ఞను ఆచరించే అఘోర పాత్రలో కనిపిస్తున్నారు.

చేతిలో త్రిశూలం, మెడలో రుద్రాక్షలతో కనిపించిన గెటప్ ఫస్ట్ పార్ట్ ని గుర్తుచేస్తోంది. గ్రాఫిక్స్ వర్క్, టెంపుల్ సెట్టింగ్స్ వీడియోకు రిచ్ లుక్ ఇచ్చాయి. బోయపాటి మార్క్ ఎలివేషన్లు పెద్దగా లేకపోయినా, అఖండ పాత్ర స్వభావం ఏంటో చెప్పడానికి ఈ పాటను వాడుకున్నట్లు స్పష్టమవుతోంది. మొదటి భాగం విజయంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది.

ఇప్పుడు ఈ సీక్వెల్ కి కూడా మ్యూజిక్ ప్రధానం కానుంది. అయితే ఈ 'హైందవం' పాటను ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ అని చెప్పలేం కానీ, సినిమా సందర్భానికి తగ్గట్టుగా ఉండే సిచువేషనల్ సాంగ్ లా ఉంది. మాస్ బీట్స్, హై పిచ్ సాంగ్స్ కోసం చూసే ఫ్యాన్స్ కు ఇది కొంచెం స్లోగానే అనిపించే అవకాశం ఉంది. మొత్తానికి ప్రమోషన్లను ఒక డివైన్ సాంగ్ తో మరో లెవెల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.