బాలయ్య 'అఖండ 2'.. నార్త్ వసూళ్ల సంగతేంటి?
టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ.. రీసెంట్ గా అఖండ 2: తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 15 Dec 2025 4:41 PM ISTటాలీవుడ్ నటసింహం బాలకృష్ణ.. రీసెంట్ గా అఖండ 2: తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా.. డిసెంబర్ 12వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది.
అయితే అప్పట్లో అఖండ మూవీ తెలుగులో మాత్రమే రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు సీక్వెల్ అఖండ 2 తాండవం మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో రూపొందింది. అందుకు కారణం.. ఓటీటీలోకి అఖండ అందుబాటులోకి వచ్చాక నార్త్ లో అదిరిపోయే రెస్పాన్స్ రావడమే. అందుకే సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించారు మేకర్స్.
సినిమాలో సనాతన ధర్మం, దేశభక్తికి సంబంధించిన అంశాలను ఉత్తరాది ఆడియన్స్ కోసమే ఎక్కువగా పెంచినట్లు తెలుస్తోంది. శివుని తాండవం, హనుమంతుడి ప్రత్యక్షం, అనేక భక్తి పరమైన సన్నివేశాలు సినిమాకు హిందీలో ఆదరణ పెంచే లక్ష్యంతోనే చేర్చారని తెలుస్తోంది. అంతే కాదు.. ప్రమోషన్స్ కూడా ఫుల్ గా నిర్వహించారు.
విడుదలకు కొద్ది రోజుల ముందు బాలయ్య ముంబై వెళ్లి మరీ సందడి చేశారు. కొన్ని హిందీ యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన కామెంట్స్.. మీమ్స్ గా మారినప్పటికీ.. డైరెక్టర్ తో కలిసి బాలయ్య కాస్త గట్టిగానే ప్రమోట్ చేశారు. అంతే కాదు.. నార్త్ లో పెద్ద ఎత్తున అఖండ 2 తాండవం మూవీని విడుదల చేశారు.
అయితే ఇప్పుడు సినిమా హిందీ వెర్షన్ వసూళ్ల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదటి మూడు రోజుల్లో హిందీ వెర్షన్ రూ.35 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అది చాలా తక్కువ అనే చెప్పాలి. ఎక్కువ ఊహించామని, నార్త్ లో అఖండ సీక్వెల్ కు తక్కువే వచ్చాయని నెటిజన్లు అంటున్నారు.
ఫస్ట్ వీకెండ్ అయిపోయాక కూడా అంత తక్కువ వసూళ్లు వచ్చాయా అని కొందరు షాక్ అవుతున్నారు. అదే సమయంలో ప్రీమియర్స్ తో కలిపి మూవీ రూ.59.5 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. బాలకృష్ణ కెరీర్ లోనే మొదటిరోజు ఈ స్థాయిలో వసూలు చేసిన ఫస్ట్ మూవీ ఇదేనని చెప్పారు. ఇప్పుడు మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 76 కోట్లు వసూల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
