Begin typing your search above and press return to search.

అఖండ 2: గెట్ రెడీ.. ఇక ఏదో ఒకటి తేలిపోద్ది!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న 'అఖండ 2' విడుదలపై గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   9 Dec 2025 9:27 AM IST
అఖండ 2: గెట్ రెడీ.. ఇక ఏదో ఒకటి తేలిపోద్ది!
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న 'అఖండ 2' విడుదలపై గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల కారణంగా సినిమా విడుదల ఆగిపోయిందన్న వార్తలతో డీలా పడ్డ అభిమానులకు, సోమవారం రాత్రి జరిగిన పరిణామాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ వివాదం కొలిక్కి వచ్చినట్లే అనిపిస్తోంది.

నిన్న రాత్రి 14 రీల్స్ నిర్మాతలు, ఎరోస్ సంస్థ మధ్య కీలకమైన చర్చలు జరిగాయట. ఇవి చాలా సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది. ఎరోస్ పెట్టిన కండిషన్లకు, నిర్మాతలు చెప్పిన పరిష్కారాలకు మధ్య ఒక అంగీకారం కుదిరినట్లు టాక్. ఇన్నాళ్లుగా ఉన్న డెడ్ లాక్ నిన్నటి మీటింగ్ తో విడిపోయిందని, సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయని టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ రోజు ఉదయం 10:30 గంటలకు మద్రాస్ హైకోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది. నిన్న రాత్రి జరిగిన చర్చల సారాంశాన్ని, కుదిరిన ఒప్పందాన్ని నిర్మాతలు నేడు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళనున్నారట. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందని కోర్టుకు తెలిపి, సినిమా విడుదలపై ఉన్న స్టే ను ఎత్తివేయమని కోరనున్నారు. కోర్టు గనక దీనికి సానుకూలంగా స్పందిస్తే ఇక లైన్ క్లియర్ అయినట్లే.

అన్నీ అనుకున్నట్లు జరిగితే.. డిసెంబర్ 12న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం కావచ్చు. అదే జరిగితే డిసెంబర్ 11న రాత్రి నుంచే ఓవర్సీస్ లో మరియు ఇక్కడ ప్రీమియర్స్ పడటం ఖాయం. వాయిదా పడుతుందని అందరూ ఫిక్స్ అయిన టైమ్ లో, ఇలా సడెన్ గా రిలీజ్ కు రెడీ అవ్వడం నిజంగా పెద్ద ట్విస్టే. ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

10:30 గంటల కోర్టు విచారణ తర్వాత వచ్చే తీర్పు మీదే అసలు సినిమా ఆధారపడి ఉంటుంది. కానీ నిన్నటి వరకు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ రావడం మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం కల్లా 'అఖండ 2' గర్జన డిసెంబర్ 12న ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. టికెట్లు బుక్ చేసుకోవడానికి ఫ్యాన్స్ రెడీగా ఉండొచ్చు. బాలయ్య బాబు దిగితే ఆ రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి కోర్టు నుంచి ఎలాంటి న్యూస్ వస్తుందో చూడాలి.