Begin typing your search above and press return to search.

అఖండ 2.. బాలయ్య కెరీర్ లోనే ఇది టాప్!

డిసెంబర్ 5న రిలీజ్ చేస్తారని వార్తలు వస్తుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కంప్లీట్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   31 Aug 2025 11:34 AM IST
అఖండ 2.. బాలయ్య కెరీర్ లోనే ఇది టాప్!
X

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఆరు పదుల వయసులో కూడా తన సినిమాలతో అలరిస్తున్నారు. యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. ఇప్పుడు అఖండ-2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు. స్టార్ అండ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

2021లో వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ.. ఓ రేంజ్ లో హిట్ అయింది. బాక్సాఫీస్ ను ఒక్కసారిగా షేక్ చేసింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో అఖండ-2 అనౌన్స్మెంట్ రావడమే లేట్.. ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ అయితే వాటిని ఫుల్ గా పెంచేసింది.

బాలయ్య, బోయపాటి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే దసరా కానుకగా సినిమాను సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వాయిదా పడుతుందని వార్తలు వచ్చినా రెస్పాండ్ అవ్వలేదు. రీసెంట్ గా అనుకున్నట్లే మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు.

డిసెంబర్ 5న రిలీజ్ చేస్తారని వార్తలు వస్తుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కంప్లీట్ చేస్తున్నారు. అదే సమయంలో ఒప్పందాలను ఖరారు చేసుకుంటున్నారు. అయితే అఖండ-2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందేందుకు పలు ఓటీటీ పడుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అమెజాన్ దక్కించుకుందని టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు జియో హాట్ స్టార్.. అఖండ సీక్వెల్ రైట్స్ ను సొంతం చేసుకుందని సమాచారం. రూ.85 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. సంక్రాంతి సెలవుల సీజన్‌ లో డిజిటల్ స్ట్రీమింగ్‌ కు అందుబాటులో ఉండేలా డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని వారు జియో హాట్ స్టార్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారని వినికిడి.

అయితే అదే జరిగేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా.. అఖండ-2 డిజిటల్ డీల్.. బాలయ్య కెరీర్ లో అతిపెద్ద ఒప్పందంగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో తెలుగు చిత్రానికి జరిగిన అతిపెద్ద డిజిటల్ ఒప్పందాల్లో కూడా ఒకటని చెప్పాలి. ఏదేమైనా డివోషనల్ టచ్ తో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై పై రామ్ ఆచంట, గోపి ఆచంట గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.