'అఖండ 2' తాండవం సాంగ్ ప్రోమో.. పూనకాలు వచ్చేలా థమన్ ప్లాన్
'అఖండ'.. ఈ పేరు వింటేనే మాస్ ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా థమన్ ఇచ్చిన ఆ బీజీఎం ఇప్పటికీ సోషల్ మీడియాలో మోగుతూనే ఉంటుంది.
By: M Prashanth | 7 Nov 2025 9:24 PM IST'అఖండ'.. ఈ పేరు వింటేనే మాస్ ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా థమన్ ఇచ్చిన ఆ బీజీఎం ఇప్పటికీ సోషల్ మీడియాలో మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పూనకం లోడింగ్‌ను డబుల్ చేసేందుకు బాలకృష్ణ బోయపాటి కాంబో 'అఖండ 2'తో రెడీ అయింది. ఈ సీక్వెల్ నుంచి ఫస్ట్ మ్యూజికల్ అప్‌డేట్ వచ్చేసింది. "అఖండ తాండవం" అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ వదిలారు.
ఈ ప్రోమోతోనే థమన్ "మ్యూజికల్ స్ట్రామ్" మొదలుపెట్టేశాడు. విజువల్స్ చూస్తే, మంచు కొండలు, పురాతన ఆలయాల మధ్య బాలయ్య అఘోరా గెటప్‌లో నడుస్తూ, ఢమరుకంతో ఇంటెన్స్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఆ బ్యాక్‌డ్రాప్‌లో "హర హర మహాదేవ్.. ఓం నమః శివాయ" అనే సౌండ్, హెవీ డ్రమ్ బీట్స్.. ఫస్ట్ పార్ట్‌ను మించిపోయే వైబ్ ఇస్తున్నాయి.
ఈసారి థమన్ వేసిన స్కెచ్ మామూలుగా లేదు. ఈ ఒక్క "తాండవం" పాట కోసం ఏకంగా ఇద్దరు మ్యూజికల్ లెజెండ్స్‌ను రంగంలోకి దించాడు. పవర్‌ఫుల్ వాయిస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన శంకర్ మహదేవన్, దేవుడి పాటలకు పెట్టింది పేరైన కైలాష్ ఖేర్.. ఈ ఇద్దరూ కలిసి ఈ పాటకు గొంతు కలిపారు. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడమే ఒక పెద్ద హైలైట్.
ప్రోమోలో వినిపించిన బీట్స్, ఆ ఇద్దరి వాయిస్ పవర్.. బోయపాటి మార్క్ ఎలివేషన్ సీన్స్‌కు, బాలయ్య అఘోరా గెటప్‌కు ఏ రేంజ్‌లో సెట్ అవుతాయో శాంపిల్ చూపించారు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్ కూడా ఈ పాటకు అదనపు బలం కానున్నాయి.
ఈ ప్రోమోతోనే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. "థియేటర్ల స్పీకర్లు బద్దలవ్వడం ఖాయం," "ఇది పాట కాదు, ఒక పూనకం" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నందమూరి ఫ్యాన్స్ ఈ మ్యూజికల్ బ్లాస్ట్ కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పనిలేదు.
ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌ను షేక్ చేస్తుండగా, ఫుల్ లిరికల్ సాంగ్‌ను నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఇక అసలు సినిమా 'అఖండ 2', డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈసారి రచ్చ డబుల్ అని ఫిక్స్ అవ్వొచ్చు.
