Begin typing your search above and press return to search.

వారణాసికి బాలయ్య.. ఎందుకంటే..

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ 2 తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   18 Dec 2025 7:05 PM IST
వారణాసికి బాలయ్య.. ఎందుకంటే..
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ 2 తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా డిసెంబర్ 12వ తేదీన గ్రాండ్ గా విడుదలైంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చింది.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ 2 తాండవం రిలీజ్ అయ్యి వారం పూర్తి కానుంది. అయితే తాజాగా బాలయ్యతోపాటు బోయపాటి శ్రీను వారణాసి వెళ్లారు. అక్కడ ఎయిర్ పోర్టులో వారిద్దరూ కనిపించిన దృశ్యాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అయితే అఖండ 2 టీమ్.. ఇప్పుడు బాలీవుడ్ పోస్ట్ ప్రమోషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు వారణాసిలోని అఘోరాలను కలిసేందుకు బోయపాటి, బాలయ్య వెళ్లినట్లు సమాచారం. వారిని కలిసి దాన్ని సినిమాకు ప్రమోషన్ గా యూజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో రేపు రిలీజ్ కానున్న అవతార్ 3 ప్రీ రివ్యూస్ వీక్ గా ఉండడంతో నార్త్ లో మళ్లీ అఖండ 2ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం ద్వారా దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రిలీజ్ కు ముందు బాలీవుడ్ లో అఖండ 2 టీమ్ ప్రమోషన్స్ నిర్వహించింది. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను.. ముంబైలో ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ లాంఛ్ చేసింది చిత్ర బృందం.

ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసి చిత్ర బృందం సినిమాలోని కీలక సన్నివేశాలు చూపించింది. అంతే కాదు సినిమాలో తాను వినియోగించిన త్రిశూలాన్ని యోగికి బహూకరించారు బాలయ్య. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ను బోయపాటి శ్రీను స్వయంగా వెళ్లి మరీ కలిశారు.

ముఖ్యంగా బాలకృష్ణ తన కెరీర్ లో ప్రమోషన్ల విషయంలో ఏ సినిమాకు కూడా ఇంత జాగ్రత్తలు తీసుకోలేదని అనిపిస్తుంది. అప్పుడు ముంబై వెళ్లి సినిమాను ప్రమోట్ చేసిన బాలయ్య.. ఇప్పుడు వారణాసి వెళ్లడం విశేషం. అయితే అఘోరాలను కలిసిన తర్వాత మూవీ టీమ్ ఇంకా ఏం ప్లాన్ చేసిందో తెలియరాలేదు. కానీ సినిమాపై మళ్లీ అందరి ఫోకస్ పడేలా పోస్ట్ ప్రమోషన్స్ ను నిర్వహించనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.