'అఖండ తాండవం' వచ్చేసింది.. ఎలా ఉందంటే..
శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్‌ల గానానికి, థమన్ హెవీ డ్రమ్ బీట్స్ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నాయి.
By: M Prashanth | 14 Nov 2025 5:49 PM IST'అఖండ'.. ఈ పేరు వింటే చాలు, థియేటర్లలో మోగిన ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తొచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఎస్.ఎస్. థమన్ సృష్టించిన ఆ మ్యూజికల్ సునామీకి కొనసాగింపుగా, ఇప్పుడు 'అఖండ 2: తాండవం' నుంచి అసలైన దైవ గర్జన మొదలైంది. బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న ఈ భారీ సీక్వెల్ నుంచి "అఖండ తాండవం" పూర్తి లిరికల్ సాంగ్ విడుదలైంది.
ఈ పాట కేవలం వినడానికి మాత్రమే కాదు, చూడటానికి కూడా ఒక విజువల్ వండర్‌లా ఉంది. మంచుతో కప్పబడిన హిమాలయాలు, పురాతన ఆలయాల వాతావరణంలో బాలకృష్ణ అఘోరా గెటప్‌లో ఢమరుకం, త్రిశూలం పట్టి నడుస్తుంటే.. ఆ విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీలో బాలయ్య వేసిన తాండవ స్టెప్స్ ఈ పాట స్థాయిని పెంచేశాయి.
ఈ పాటకు థమన్ సెట్ చేసిన కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఈ ఒక్క పాట కోసం సంగీతంలోని దిగ్గజాలను థమన్ ఒకచోటకు తీసుకొచ్చారు. తన పవర్‌ఫుల్ వాయిస్‌తో ఎన్నో సంచలనాలు సృష్టించిన శంకర్ మహదేవన్, దైవభక్తి పాటలకు పెట్టింది పేరైన కైలాష్ ఖేర్.. ఈ ఇద్దరూ కలిసి ఈ పాటకు ప్రాణం పోశారు.
శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్‌ల గానానికి, థమన్ హెవీ డ్రమ్ బీట్స్ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నాయి. "హే ఖండ ఖండ ఖండితా, నరసింహ ధర్మ రక్షకా.. మహా పంచ భూత సంచకా.. అంటూ కళ్యాణ్ చక్రవర్తి అందించిన సంస్కృత పదాలతో కూడిన శక్తివంతమైన లిరిక్స్.. అఘోరా పాత్రకు, బోయపాటి ఎలివేషన్లకు నూటికి నూరు శాతం సరిపోయాయి.
ఈ లిరికల్ వీడియోలో కేవలం పాట మాత్రమే కాకుండా, మేకింగ్ షాట్స్‌ను కూడా జతచేశారు. బోయపాటి శ్రీను, రామ్ లక్ష్మణ్ సెట్‌లో సీన్స్‌ను వివరిస్తున్న తీరు, సింగర్స్ ఇద్దరూ స్టూడియోలో ఎంతో లీనమై పాడుతున్న విజువల్స్ పాటపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరో లెవెల్ కు వెళ్లేలా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. "స్పీకర్లు బద్దలవ్వడం ఖాయం", "ఇది పాట కాదు.. థియేటర్లో పూనకం లోడింగ్" అంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇక డిసెంబర్ 5న రానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
