అఖండ2 బిజినెస్ క్లోజ్ అయినట్టేనా?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న సినిమా అఖండ2 తాండవం.
By: Sravani Lakshmi Srungarapu | 19 Aug 2025 12:53 PM ISTగాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న సినిమా అఖండ2 తాండవం. వీరిద్దరి కలయికలో వస్తోన్న నాలుగో సినిమా ఇది. గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అవడంతో అఖండ2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే అఖండ2 నుంచి వచ్చిన టీజర్ కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వాయిదా వార్తలపై నోరెత్తని మేకర్స్
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న అఖండ2 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ దగ్గర పడుతున్నా మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ ను మొదలుపెట్టకపోవడంతో ఈ సినిమా వాయిదా పడిందని అందరూ భావిస్తూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇంత ప్రచారం జరుగుతున్నా దర్శకనిర్మాతలు ఎక్కడా దీనిపై నోరెత్తకపోవడంతో వాయిదా తప్పేలా లేదని అందరూ అనుకుంటున్నారు.
అఖండ2కు భారీ డిమాండ్
బాలయ్య కెరీర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ అఖండ2 రైట్స్ కోసం పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ డీల్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో భాగంగానే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకున్న తర్వాత జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే విధంగా డీల్ కుదిరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో కంటే జియో హాట్ స్టార్ అఖండ2 కు ఎక్కువ మొత్తంగా ఆఫర్ చేసినందున ఈ డీల్ జియో హాట్‌స్టార్ కు దక్కే వీలుందని అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా, ఈ సినిమా కోసం బాలయ్య తన కెరీర్లోనే భారీ రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అఖండ మొదటి భాగానికి సంగీతం అందించిన తమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా, బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
