Begin typing your search above and press return to search.

బాలయ్య 'అఖండ 2'.. ఇద్దరిపై ఎఫెక్ట్ తప్పేలా లేదు!

అయితే ఇప్పుడు అఖండ 2 తాండవం కొత్త విడుదల తేదీ ప్రకటన ఎఫెక్ట్.. కచ్చితంగా చిన్న సినిమాలపై పడుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

By:  M Prashanth   |   7 Dec 2025 1:47 PM IST
బాలయ్య అఖండ 2.. ఇద్దరిపై ఎఫెక్ట్ తప్పేలా లేదు!
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా రిలీజ్ కావాల్సి ఉన్నా.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25వ తేదీకి రావాల్సిన సినిమా.. డిసెంబర్ 5కు వాయిదా పడింది. ఇప్పుడు అది కూడా జరగలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు.

కొత్త డేట్ ను మేకర్స్ త్వరలో ప్రకటిస్తామని చెప్పగా.. ఇప్పుడు దాని కోసమే సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే డిసెంబర్ 5వ తేదీని అఖండ మేకర్స్ ఫిక్స్ చేయగా.. ఆ తర్వాత వివిధ సినిమాల మేకర్స్ తమ చిత్రాలను ప్లాన్ చేసుకున్నారు. రిలీజ్ డేట్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వాటిలో ఉన్నవన్నీ చిన్న మూవీలే.

అయితే ఇప్పుడు అఖండ 2 తాండవం కొత్త విడుదల తేదీ ప్రకటన ఎఫెక్ట్.. కచ్చితంగా చిన్న సినిమాలపై పడుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మోగ్లీ, సైక్ సిద్ధార్థ, శంబాల, ఛాంపియన్.. ఈ నాలుగింటిలో ఏవో రెండు చిత్రాలపై అఖండ ప్రభావం ఉంటుంది. ఆ సినిమాల విడుదల తేదీలు కూడా మారే అవకాశం ఉందని చెప్పాలి.

ఎందుకంటే.. అఖండ 2 అయితే డిసెంబర్ 12న లేకుంటే డిసెంబర్ 25వ తేదీ విడుదల అవ్వనుందని టాక్ వినిపిస్తోంది ఒకవేళ డిసెంబర్ 12న రిలీజ్ చేస్తారనుకుంటే.. అప్పటికే ఆ తేదీకి మోగ్లీ, సైక్ సిద్ధార్థ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు.. అఖండ-2కు వారం గ్యాప్ లో రావాలని చూసుకుని ఫిక్స్ అయ్యాయి.

మోగ్లీతో రోషన్ కనకాల.. సైక్ సిద్ధార్థతో శ్రీ నందు మంచి హిట్స్ అందుకుంటామని నమ్మకంతో ఉన్నారు. ఇద్దరూ కమ్ బ్యాక్ ఇద్దామని అనుకుంటున్నారు. కానీ అఖండ 12న వస్తే.. మళ్లీ వారి సినిమాలు వాయిదా పడతాయి. అదే సమయంలో డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ అయితే రోషన్ మేక, ఆది సాయికుమార్ కు చిక్కులు ఎదురవుతాయి.

వాళ్లిద్దరూ నటించిన ఛాంపియన్, శంబాల ఆ తేదీకే ఫిక్స్ అయ్యాయి. రోషన్, ఆది.. తమ సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు అఖండ 25వ తేదీన వస్తే.. వారిద్దరికీ ఇబ్బందే. కానీ ఆది మాత్రం.. తన సినిమా అదే తేదీకి రిలీజ్ అవుతుందని తెలిపారు. వేరే ఆప్షన్ లేదని చెప్పారు.

ఛాంపియన్ మేకర్స్ మాత్రం వాయిదా వేసేందుకు సిద్ధమవుతున్నారట. ఏదేమైనా అఖండ 2 వాయిదా పడడం.. చిన్న హీరోలకు పెద్ద ఇబ్బందిగా మారింది. రోషన్ కనకాల, శ్రీ నందు, రోషన్ మేక, ఆది సాయికుమార్ లో ఎవరో ఇద్దరిపై ఎఫెక్ట్ గట్టిగా పడే అవకాశం ఉంది. మరి అఖండ 2 ఎప్పుడు వస్తుందో.. ఏం జరుగుతుందో వేచి చూడాలి.