జాజికాయ సాంగ్: బాలయ్య మాస్ స్టెప్స్.. తమన్ మార్క్ బీట్స్!
'అఖండ 2' అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.
By: M Prashanth | 18 Nov 2025 8:38 PM IST'అఖండ 2' అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన "అఖండ తాండవం" పాట డివోషనల్ వైబ్స్‌తో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో పాట హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్‌కి ముందే హైప్ క్రియేట్ చేసిన ఆ స్పెషల్ నంబర్ ఎట్టకేలకు బయటకు వచ్చేసింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అఖండ 2' సెకండ్ సింగిల్ "జాజికాయ జాజికాయ" ఆడియన్స్ ముందుకు వచ్చింది. వైజాగ్‌లోని మాస్ క్రౌడ్ మధ్య గ్రాండ్‌గా లాంచ్ చేసిన ఈ పాట, సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ తో మొదలై స్లోగా ఎక్కుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పటి నుంచే ఇందులో ఏదో స్పెషల్ ఉంటుందని ఆశించారు, ఇప్పుడు లిరికల్ వీడియో చూస్తే విజువల్స్ పరంగా ఆ రిచ్‌నెస్ కనిపిస్తోంది.
తమన్ మ్యూజిక్ అంటేనే డ్రమ్స్ సౌండ్ గట్టిగా ఉంటుంది. ఈ పాటలోనూ తన మార్క్ బీట్స్ వినిపించాడు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇలాంటి పక్కా ఊర మాస్ బీట్‌కి మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్ వాయిస్ తోడవ్వడం. బ్రిజేష్ శాండిల్య హై పిచ్ వాయిస్, శ్రేయా గాత్రం కొత్తగా ఉన్నాయి. కాసర్ల శ్యామ్ రాసిన "జాజికాయ" లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. వినగానే క్లాసిక్ అనిపించకపోయినా, రిపీట్ మోడ్‌లో వింటే మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక వీడియోలో విజువల్స్ చాలా కలర్ ఫుల్‌గా, గ్రాండ్‌గా ఉన్నాయి. బాలకృష్ణ బ్లాక్ అండ్ గోల్డ్ కాస్ట్యూమ్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూనే, తనదైన మాస్ స్టెప్స్‌తో ఎనర్జీ చూపించారు. హీరోయిన్ సంయుక్త గ్లామర్, డ్యాన్స్ ఈ పాటకు మరో ప్రధాన ఆకర్షణ. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, వెనుక భారీ గ్రూప్ డ్యాన్సర్లు, సెట్టింగ్స్ చూస్తుంటే.. ఇది థియేటర్‌లో బిగ్ స్క్రీన్ మీద విజువల్ ఫీస్ట్‌లా ఉండే అవకాశం ఉంది.
గతంలో వచ్చిన 'అఖండ'లోని "జై బాలయ్య" పాట ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ "జాజికాయ" ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యాక గానీ క్లారిటీ రాదు. కానీ ఆడియో పరంగా చూస్తే, ఇది ఫ్యాన్స్‌కి, మాస్ సెంటర్లకి కావాల్సిన బీట్స్ ఉన్న పాటగానే కనిపిస్తోంది. బోయపాటి మార్క్ టేకింగ్ సాంగ్‌లో స్పష్టంగా తెలుస్తోంది.
మొత్తానికి 'అఖండ 2' ప్రమోషన్లకు ఈ పాట మంచి ఊపునిచ్చింది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి, ఈలోపు ఈ పాట జనాల్లోకి ఎంత బలంగా వెళ్తే ఓపెనింగ్స్ అంత భారీగా ఉంటాయని టీమ్ భావిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్, రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
