అతని వల్ల అఖండ-2 ఆలస్యం.. మరి రిలీజ్ ఎప్పుడంటే?
అయితే సెప్టెంబర్ 25వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో జాప్యం కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.
By: M Prashanth | 4 Sept 2025 11:54 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ అఖండ-2 కోసం అంతా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఆ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలయ్య మళ్లీ డ్యూయల్ రోల్ లో సందడి చేయనున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న అఖండ సీక్వెల్.. దైవిక అంశాలతో యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ కు టాలీవుడ్ లో ప్రత్యేక క్రేజ్ ఉండడంతో అఖండ-2పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే సెప్టెంబర్ 25వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో జాప్యం కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. కొత్త విడుదల తేదీని ఇంకా అనౌన్స్ చేయలేదు. దీంతో అప్డేట్స్ కోసం బాలయ్య ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రీసెంట్ గా మేకర్స్.. డబ్బింగ్ పనులు పూర్తి అయినట్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు బాలయ్య.. అఖండ-2 రిలీజ్ పై మాట్లాడారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు వెల్లడించారు. మూవీ త్వరలోనే వస్తోందని తెలిపారు. కానీ సెప్టెంబర్ 25వ తేదీన కాదని, డిసెంబర్ తొలి వారంలో థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని తెలిపారు.
తమన్ కు కాస్త ఎక్కువ సమయం కావాల్సి వచ్చిందని, అఖండ టైమ్ లో ఆయన అందించిన మ్యూజిక్ కు వూఫర్లు బద్ధలైపోయాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండని తెలిపారు. ఆ మూవీ కంటే రెట్టింపు కాదు 50 రెట్లు ఎక్కువ ఉండబోతోందని చెబుతూ ఒక్కసారిగా ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు పెంచారు.
అయితే సినిమా బాగా రావాలన్నదే తమ ఉద్దేశమని తెలిపిన బాలయ్య.. అందుకే రిలీజ్ వాయిదా పడిందని చెప్పారు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని వెల్లడించారు. ఇక సినిమాలో నటుడు ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్న అఖండ సీక్వెల్.. డిసెంబర్ లో ఏ తేదీన రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.
