'అఖండ-2' రిలీజ్ పై మళ్లీ పిడుగు లాంటి ప్రచారం!
'అఖండ-2' ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ సంకల్పించారు.
By: Srikanth Kontham | 17 Aug 2025 1:04 PM IST'అఖండ-2' ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ సంకల్పించారు. ఆ దిశగా చిత్రీ కరణ సహా అన్ని పనులు పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి మేకర్స్ ఇదే మాట మీద ఉన్నారు. బాలయ్య కూడా ప్రకటించిన తేదీకే రిలీజ్ చేయాలని అంతే పట్టు దలతో పని చేస్తున్నారు. దీంతో అభిమానులు సెప్టెంబర్ 25కి ఫిక్సైపోయారు. ఆగస్టు సగం రోజులు కూడా గడిచి పోయాయి. అంటే రిలీజ్ కి ఇంకా 40 రోజులు మాత్రమే చేతిలో ఉన్నాయి.
మరి ఈ నలభై రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ కు వచ్చేస్తుందా? అంటే తాజాగా సందేహాలు వ్యక్త మవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు వాయిదా పడుతుందని వార్తలొస్తున్నాయి. వాస్తవానికి డిసెంబర్ లో రిలీజ్ ఉండొచ్చని గతంలోనే కథనాలొచ్చాయి. కానీ బాలయ్య స్పీడ్ తో సెప్టెంబర్ లో రిలీజ్ సాధ్యమవుతుందనుకున్నారంతా. తాజాగా సమీకరణాలు మారతుండటంతో? వాయిదా వార్త ఈసారి మరిం త బలంగా తెరపైకి వస్తోంది.
చిత్రీకరణ ఆలస్యమవుతుందా? పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిలే అవుతుందా? అన్నది బయటకు రాలేదు గానీ..వాయిదా మాత్రం తధ్యం అనేది గట్టిగానే వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి విజువల్ ఎఫెక్స్ట్ కీలకం. బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో విఎఫ్ ఎక్స్ ప్రాధాన్యత ప్రతీ సినిమాలోనూ కనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఎంత మాత్రం రాజీ పడరు. యాక్షన్ సన్నివేశాల డిజైనింగ్ లో నూ బోయపాటి హస్తం ఉంటుంది.
పైగా ఈసారి `అఖండ 2` తో బాలయ్య పాన్ ఇండియా మార్కెట్ లో కి అడుగు పెడుతోన్న సంగతి తెలి సిందే. దీంతో చిత్రాన్ని అంతే ప్రతష్టాత్మకంగాను భావించి ముందుకెళ్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ కాకుండానే బాలయ్య కు `అఖండ`తో ఈ రేంజ్ ఇమేజ్ క్రియేట్ అయింది. బాలయ్య ప్రభావం నార్త్ లో ఏ రేంజ్ లో ఉన్నందన్నది కుంభమేళ సహా వివిధ సందర్భాల్లో బయట పడిన సంగతి తెలిసిందే.
