Begin typing your search above and press return to search.

అఖండ-2.. ఇప్పుడు మరో ప్రాబ్లం.. ఏం జరుగుతోంది?

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కావాల్సిన బాలకృష్ణ అఖండ-2 మూవీ.. విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా పడిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   6 Dec 2025 1:24 PM IST
అఖండ-2.. ఇప్పుడు మరో ప్రాబ్లం.. ఏం జరుగుతోంది?
X

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కావాల్సిన బాలకృష్ణ అఖండ-2 మూవీ.. విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందు ప్రీమియర్స్ మాత్రమే రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు.. ఆ తర్వాత పూర్తిగా సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ను ఆ సమయంలో అనౌన్స్ చేయలేదు.

అయితే అఖండ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ చుట్టూ ఆర్థిక చిక్కులు చేరడమే మూవీ వాయిదా పడటానికి ప్రధాన కారణం. తమకు ఇవ్వాల్సిన రూ.28 కోట్ల బకాయిలు ఇచ్చే వరకు సినిమా విడుదల నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్టైన్మెంట్స్.. మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది.

దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం, సినిమా రిలీజ్ పై స్టే విధించింది. మొత్తం చెల్లించాకే విడుదల చేయాలని ఆదేశించింది. ఇప్పుడు అఖండ-2 నిర్మాతలు.. పాత బకాయిలు క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలో మొత్తం క్లియర్ అవ్వనున్నాయి!

ఆర్థిక అడ్డంకులను తొలగించుకుని క్రిస్మస్ కానుకగా అఖండ-2ను రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు నిర్మాతలకు మరో సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. రూ.11 కోట్ల రూపాయలను రిఫండ్ చేయమని అమెరికా డిస్ట్రిబ్యూటర్లు.. డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పోస్ట్ పోన్ వల్ల తాము నష్టపోయినట్లు చెప్పారని వినికిడి.

సడెన్ గా ప్రీమియర్స్ ను రద్దు చేయడంతోపాటు సినిమాను వాయిదా వేయడం వల్ల ఒక్కసారిగా షాక్ అయ్యామని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అప్పటికే అఖండ కోసం తీసుకున్న స్క్రీన్స్ ను వదిలేయాల్సి వచ్చిందని చెప్పారట. అందుకు తమకు జరిగిన నష్టానికి గాను ఇప్పుడు రూ.11 కోట్ల రిఫండ్ చెల్లించాలని డిమాండ్ చేసినట్లు టాక్.

దీంతో నిర్మాతలు.. ఆ విషయంపై యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఒక సమస్య క్లియర్ అవుతుంటే.. మరో ప్రాబ్లం వచ్చి పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. అసలేం జరుగుతుందోనని కామెంట్లు పెడుతున్నారు. రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాలని అంతా కోరుతున్నారు.