బాలయ్య 'అఖండ 2'.. మధ్యలో ఇదేంటి మళ్లీ?
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన ఆ మూవీ.. నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది.
By: M Prashanth | 6 Dec 2025 3:43 PM ISTఅఖండ 2.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే చర్చ నడుస్తోంది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన ఆ మూవీ.. నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. ముందు రోజు.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రీమియర్స్ తో సందడి మొదలు కావాల్సి ఉంది.
కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. వాయిదా విషయాన్ని ప్రకటించే సమయంలో.. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు విడుదల తేదీని ప్రకటించలేదు. దీంతో అంతా వెయిట్ చేస్తున్నారు.
అయితే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ కానుకగా సినిమాను రిలీజ్ చేస్తారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అందుకు అనుగుణంగా మేకర్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని, త్వరలో ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంతలో ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ యాప్ లో వచ్చిన అప్డేట్.. ఒక్కసారిగా నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఈ నెలలోనే సినిమా రానుందని టాక్ వస్తుండగా.. బుక్ మై షో నిర్వాహకులు వచ్చే ఏడాది మూవీ రిలీజ్ కానుందని మెన్షన్ చేశారు. దీంతో అసలేం జరుగుతుందని సినీ ప్రియులు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. అయితే మేకర్స్ అప్డేట్ ఇవ్వలేదని బుక్ మై షో అలా మెన్షన్ చేసిందా లేదా నిజంగా నెక్స్ట్ ఇయర్ వస్తుందా అని అంటున్నారు.
అయితే వాయిదా పడ్డాక.. అఖండ 2 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ పొంగల్ స్లాట్స్ ఇప్పటికే ఫిల్ అయిపోయాయి. దీంతో అప్పుడు కష్టమని చాలా మంది భావించారు. ఇప్పుడు బుక్ మై షోలో అలా మెన్షన్ చేయడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.
కాగా.. బాలయ్య కొంతకాలంగా సూపర్ హిట్స్ అందుకున్న దూసుకుపోతున్నారు. వరుస విజయాలు సాధిస్తూ సందడి చేస్తున్నారు. యంగ్ హీరోస్ కు గట్టి పోటీనిస్తూ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు అఖండ-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారనే అంచనాలు అందరిలో ఉన్నాయి. మరి అఖండ 2: తాండవం మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి.
