Begin typing your search above and press return to search.

బాల‌య్య శివ‌తాండ‌వం డేట్ లాక్డ్

`అఖండ 2` రిలీజ్ మిస్ట‌రీ వీడిందా? డిసెంబ‌ర్ రిలీజా? జ‌న‌వ‌రి రిలీజా? అన్న దానిపై క్లారిటీ వ‌చ్చేసిందా? డేట్ లాక్ అయిందా? అంటే అవున‌నే స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   7 Sept 2025 9:00 PM IST
బాల‌య్య శివ‌తాండ‌వం డేట్ లాక్డ్
X

`అఖండ 2` రిలీజ్ మిస్ట‌రీ వీడిందా? డిసెంబ‌ర్ రిలీజా? జ‌న‌వ‌రి రిలీజా? అన్న దానిపై క్లారిటీ వ‌చ్చేసిందా? డేట్ లాక్ అయిందా? అంటే అవున‌నే స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ అవ్వా ల్సిన చిత్రం అనూహ్యంగా వాయిదా ప‌డ‌టంతో ప్రేక్ష‌కాభిమానులు ఒక్క‌సారిగా గుర‌య్యారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం కార‌ణంగా రిలీజ్ వాయిదా వేస్తున్నామ‌ని..రిలీజ్ ఎప్పుడన్న‌ది త‌ర్వాత చెబుతామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డంతో? నంద‌మూరి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యారు.

ఈ క్ర‌మంలో ఓ కొత్త సందేహం కూడా వ్య‌క్త‌మైంది. పోటీగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న `ఓజీ` కూడా రిలీజ్ కు అదే డేట్ లో ఉండటంతో బాల‌య్య వెనక్కి త‌గ్గుతున్నారు? అన్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాని ఠారెత్తిం చింది. కానీ ఒక‌టి రెండు రోజుల‌కే అలాంటిదేమీ లేద‌నీ...విఎఫ్ ఎక్స్ కార‌ణంగానే వాయిదా ప‌డుతున్న‌ట్లు పూర్తి క్లారిటీ రావ‌డంతో? అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్ర‌మంలో చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో బాల‌య్య ఓ ఈవెంట్ లో జ‌న‌వ‌రి లేదా? డిసెంబ‌ర్ నెల‌ను కూడా ప‌రిశీలిస్తున్నామ‌న్నారు.

ఈ నేప‌థ్యంలో అభిమానుల్లో మ‌ళ్లీ రిలీజ్ ఆశ‌లు చిగురించాయి. దీంతో రిలీజ్ డిసెంబ‌ర్ లో ఉంటుందా? జ‌న‌వ‌రిలో ఉంటుందా? అన్న దానిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చమొద‌లైంది. తాజాగా చిత్ర వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం తెలిస్తే బాల‌య్య అభిమానుల్లో పూన‌కాల ఖాయం. చిత్రాన్ని డిసెంబ‌ర్ 5న రిలీజ్ తేదీగా లాక్ చేసిన‌ట్లు చిత్ర వ‌ర్గాల నుంచి తెలిసింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా న‌వంబ‌ర్ మొద‌టివారానిక‌ల్లా పూర్త‌వుతాయ‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అప్పటి నుంచి జ‌న‌వ‌రి వ‌ర‌కూ సినిమాను హోల్డ్ చేయ‌డం భావ్యం కాద‌ని...లీకుల బెడ‌ద కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతో? డిసెంబ‌ర్ లోనే రిలీజ్ చేయాల‌ని బాల‌య్య‌-బోయ‌పాటి కూడా ఫిక్సైపో యారుట‌. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న మ‌రికొన్ని రోజుల్లో వస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటు న్నాయి. `అఖండ `లాంటి హిందుత్వ కాన్సెప్ట్ చిత్రాన్ని మంచి నెల‌లోనే రిలీజ్ చేయాల‌ని బాల‌య్య కూడా గ‌ట్టిగానే ప‌ట్టుబ‌ట్టారుట‌. జ‌న‌వ‌రి కంటే డిసెంబర్ లోనే మంచి రోజులు ఉండ‌టంతో అదే నెల అయితే బాగుంటుంద‌ని బాల‌య్య కూడా ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.